తాజా లోకల్ ఈవెంట్స్
Search

19 నుంచి 21 వరకు జాబ్‌మేళా

***కాపు యువతకు 19 నుంచి 21 వరకు జాబ్‌మేళా***
కైకలూరు, న్యూస్‌టుడే: కాపు కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 19, 20, 21వ తేదీల్లో ఇబ్రహీంపట్నంలోని నోవా కళాశాలలో కాపు నిరుద్యోగ యువతకు ప్రత్యేక జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఛైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ తెలిపారు. స్థానిక మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో బుధవారం ఆయన తెదేపా నాయకులతో కలిసి విలేకర్లతో మాట్లాడుతూ మేళాలో సుమారు 100 కంపెనీలు పాల్గొంటాయన్నారు. పది, ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌ ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు చదివిన వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. సుమారు 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా సంస్థ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 19, 20వ తేదీల్లో కంపెనీలు నిర్వహించే ఇంటర్వ్యూలను ఎదుర్కొనే నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. గ్రామాల్లో ఇంటి వద్ద ఖాళీ సమయాన్ని గడుపుతున్న కాపు మహిళల కోసం కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, పచ్చళ్ల తయారీ వంటి చిన్నతరహా పరిశ్రమల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నామన్నారు. వీరికి నెలకు రూ. 2 వేల ఉపకార వేతనం అందించడంతోపాటు, తయారు చేసిన వాటిని ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే కార్పొరేషన్‌ ద్వారా రూ. 850 కోట్లతో కాపులకు రాయితీ రుణాలు అందిచామన్నారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో రూ. ఐదు కోట్లతో కాపు కార్పొరేషన్‌ భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. విదేశాల్లో చదువుకోనేందుకు కాపు విద్యార్థికి రూ. 10 లక్షల వంతున ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. వీసా, అక్కడి విశ్వవిద్యాలయాల్లో దరఖాస్తు ఖర్చులు, టోఫెల్‌ శిక్షణ వంటి వాటికి ఒక్కో విద్యార్థికి అదనంగా రూ. 80 వేల నుంచి రూ. 90 వేల వరకు ఖర్చు చేస్తున్నామన్నారు. సివిల్స్‌ సర్వీసుల నిమిత్తం రాష్ట్రంలోని 500 మంది విద్యార్థులకు శిక్షణ నిమిత్తం ఒక్కొక్కరికి దాదాపు రూ. 3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికి నెలకు రూ. 10 వేల చొప్పున ఉపకార వేతనాలు చెల్లిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువత నలుగురైదుగురు కలిసి బృందంగా ఏర్పడి పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తే అవసరమైన ఆర్థిక సాయం అందించేందుకు కార్పొరేషన్‌ సిద్ధంగా ఉందన్నారు. వీరికి ప్రభుత్వం పరంగా రూ. 10 లక్షల వరకు రాయితీ ఇస్తామన్నారు. మార్కెట్‌ కమిటీ అధ్యక్షురాలు చింతపల్లి వీరరాజరాజేశ్వరి, ఉపాధ్యక్షుడు లావేటి వీరశివాజీ, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పూల రామచంద్రరావు, ఎస్సీ విభాగం జిల్లా కార్యదర్శి కొడలి పండుబాబు, దేశం నేత చింతపల్లి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.
Thank You
Vijayawada TownHub

URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en
Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.


TAG

nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “19 నుంచి 21 వరకు జాబ్‌మేళా