తాజా లోకల్ ఈవెంట్స్
Search

చేతుల శుభ్రత.. ఆరోగ్యానికి భద్రత


చేతుల శుభ్రత..
ఆరోగ్యానికి భద్రత
ముట్టుకుంటే ముప్పేట దాడే
 
ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు.. అభివృద్ధి చెందుతున్న భారతావనిలో రోగాలు దినదిన ప్రవర్థమానమై ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం రోగకారక క్రిములు. చేతులు పరిశుభ్రత లేకపోవడంతో అనేక క్రిములు ఆహారం ద్వారా నోటిలోకి చేరి వ్యాధులకు మూలంగా మారుతున్నాయి. ఆహారం తీసుకునే ప్రతిసారీ చేతులు కడుక్కోవాలి. అలా చేయకపోతే చేతి గోళ్లలో చేరిన బాక్టీరియా, కొన్ని రకాల క్రిములు ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. రోగాల బారిన పడటానికి ప్రధానంగా చేతులు శుభ్రం చేసుకోకపోవడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. దీని ఆవశ్యకతను గుర్తించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా అక్టోబరు 15న ప్రపంచ చేతులు శుభ్రత దినోత్సవంగా నిర్వహిస్తోంది. * చేతులు కడుక్కోకపోవడం వల్ల గోళ్లలో చేరిన సూక్ష్మక్రిములు డయేరియా, రక్తహీనత, టైఫాయిడ్‌ వంటి వ్యాధులకు కారణమవుతాయి.
* ఏటీఎం కీబోర్డులు.. కరెన్సీ నోట్లు.. తలుపు గొళ్లేలు..స్విచ్చులు వంటివన్నీ బ్యాక్టీరియా చేరే ప్రదేశాలే.
* కరెన్సీ నోట్లపై దాదాపు 78 రకాల రోగక్రిములు ఉన్నట్లు ఒక పరిశోధన సంస్థ గతంలో వెల్లడించింది.
* అరచేతిలో స్వర్గంగా భావిస్తున్న మొబైల్‌ ఫోన్లపై ఉన్న అనేక రకాలైన బ్యాక్టీరియా ఆరోగ్యాన్ని హరిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.
క్రిముల ఆవాసాలు..
నిత్యం చేతులు శుభ్రంగా కడగకపోతే అనేక రోగకారక క్రిములు శరీరంలోకి వెళ్లే ప్రమాదముందని ఒక పరిశోధనలో తేలింది. ప్రధానంగా తలుపులు తీసే సమయంలో గొళ్లేలు, బహిరంగ ప్రదేశాలు, పుస్తకాలు, కార్యాలయాలు, ఏటీఎంలు, లిప్టు స్విచ్చులు, గోడలు చేతులకు ఆనుకున్నప్పుడు, కరెన్సీ నోట్లు లెక్కించినప్పుడు వివిధ రకాల బ్యాక్టీరియా చేతులకు అంటుకుంటుంది. మట్టిలో ఆడుకునే పిల్లలపై వీటి ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. పల్లెప్రాంతాల్లో ప్రజలు కాయకష్టం చేస్తారు. అవగాహన లేకపోవడం వల్ల హడావుడిగా వచ్చి ఆహారం తీసుకుంటుంటారు. ఇది అనారోగ్యానికి కారణమవుతోంది. పాఠశాలల విద్యార్థులు కూడా ఆటపాటల్లో మునిగిపోయి తగిన జాగ్రత్తలు తీసుకోరు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం పాఠశాలల్లో చేతులు శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చింది. మధ్యాహ్న భోజనం చేసేముందు పాఠశాలల్లో సబ్బు ఏర్పాటుచేసి చేతులు పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
వ్యాధులు ఇలా..
నిత్యం మనం వినియోగించే వస్తువులపై క్రిములు ఎక్కువగా ఉంటే కొన్ని రోగాలు కొని తెచ్చుకుంటాం. ప్రధానంగా ఈ వస్తువులపై ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌, హెపటైటిస్‌ ఏ, బీ, సీ, డీతో పాటు హెర్పిస్‌, ఎడినో తదితర రకాలకు చెందిన రోగకారక క్రిములు ఆవాసం ఉంటాయి. వీటి ద్వారా వివిధ రకాల జ్వరాలు, రక్తకణాల తగ్గుదల, డయేరియా వంటి ఆరోగ్య సమస్యలొస్తాయి.
చేతులు శుభ్రత తప్పనిసరి..
వ్యాధులు సోకకుండా ఉండాలంటే చేతుల శుభ్రత తప్పనిసరి. చేతులు అపరిశుభ్రంగా ఉండటం వల్ల మలేరియా, టైఫాయిడ్‌ వంటి వ్యాధులు సోకుతాయి. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేందుకు అవగాహన కల్పించాలి. చిన్ననాటి నుంచే అవగాహన కల్పించాలి.
దీనికి ఓ పద్ధతుంది..
* చేతులు నీళ్లతో బాగా తడుపుకొని, తగినంత సబ్బుని తీసుకోవాలి.
* రెండు అరచేతులను కలిపి బాగా రుద్దాలి.
* కుడి అరచేయితో ఎడుమ చేయి వెనుక భాగం, అదే విధంగా ఎడమ అరచేయితో కుడిచేయి వెనుకభాగం బాగా రుద్దాలి.
* రెండు చేతివేళ్లను ఒక దానిలోనికి ఒకటి చొప్పించి రుద్దాలి.
* ఎడమ చేతి వేళ్లను ముడిచి, కుడి అరచేయిలో, అదే విధంగా కుడిచేయి వేళ్లను ముడిచి ఎడమ అరచేయిలో రుద్దాలి.
* ప్రతి బొటన వేలును మరొక చేతితో చుట్టి రుద్దాలి.
* ప్రతి అరచేయిని మరో చేయి మునివేళ్లతో రుద్దాలి.
* సబ్బుతో చేతులు కడుక్కోవడం చాలా కీలకం.
* వారానికోసారి గోళ్లను కత్తిరించుకోవాలి.



nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “చేతుల శుభ్రత.. ఆరోగ్యానికి భద్రత