****శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి శ్రీ దుర్గా దేవి అలంకారము****
శ్రీ దుర్గా దేవి:
“ 
విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిః కరవాలఖేట 
విలద్దస్తా భిరాసేవితాం ! హసైశ్చక్రగదాసిఖేట విసిఖాంశ్చాపం గుణం తర్జనీం 
బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం  భజే ‘’
దుర్గతులను
 నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో 
దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుడ్ని 
సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాల్లో 
దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడ్ని ఈ మాత అనుగ్రహించి 
మోక్షాన్ని ప్రసాదిస్తుంది.  కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే
 శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు ఈ అమ్మనామాన్ని 
జపిస్తే తొలగిపోతాయి.  ఆరాధకులకు ఈమె శీఘ్ర  అనుగ్రహకారిణి. ఎర్రనిబట్టలు 
పెట్టి ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం 
పారాయణ చెయ్యాలి. “ ఓం దుం దుర్గాయైనమః ‘’ అనే మంత్రం పఠించాలి. పులగాన్నం 
నివేదన చెయ్యాలి. దుర్గా, లలిత అష్టోత్తరాలుపఠించాలి.
Thank You 
Vijayawada TownHub
URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en
Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.
Vijayawada TownHub
URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en
Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.





















0 thoughts on “ఈ రోజు అమ్మవారి శ్రీ దుర్గా దేవి అలంకారము”