తాజా లోకల్ ఈవెంట్స్
Search

రేపటి నుంచి బాణసంచా విక్రయాలు


రేపటి నుంచి బాణసంచా విక్రయాలు
 
మహాత్మాగాంధీ రోడ్డులోని విజయకృష్ణా సూపర్‌బజార్‌ ప్రధాన శాఖ ఆవరణలో శుక్రవారం నుంచి బాణసంచా విక్రయిస్తున్నట్లు సూపర్‌బజార్‌ ఛైర్మన్‌ గొట్టుముక్కల రఘురామరాజు వెల్లడించారు. బుధవారం విజయకృష్ణా సూపర్‌బజార్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో విక్రయాల వివరాలను వెల్లడించారు. గతంలో విజయకృష్ణా సూపర్‌బజార్‌లోనే బాణసంచా విక్రయాలు జరిగేవన్నారు. తరువాత స్వరాజ్యమైదానంలో విక్రయాలు చేస్తున్నామని తెలిపారు. రెండు రోజుల కిందట జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రికి సూపర్‌బజార్‌ ఆర్ధిక పరిస్థితిని వివరించి విక్రయాలు స్థానికంగా జరిగేలా అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో అడిగినట్లు తెలిపారు. ఆయన వెంటనే అంగీకరించారని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నుంచి బాణసంచాను విక్రయిస్తామని ఎమ్మార్పీ ధరలపై 75 శాతం తగ్గింపు ఉంటుందన్నారు. పున్నమిఘాట్‌లో కూడా విజయకృష్ణా సూపర్‌బజార్‌ స్టాళ్లు నెలకొల్పినట్లు గొట్టుముక్కల రఘురామరాజు వెల్లడించారు. సూపర్‌బజార్‌ డైరెక్టర్లు పరుచూరి ప్రసాద్‌, దానం కనకరావు, వెంకట్రావు, ఈది పార్వతి తదితరులు పాల్గొన్నారు.

Vijayawada TownHub ·
For more info about Vijayawada, Please Download "Vijayawada TownHub" free mobile app from google play store / apple store.



nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “రేపటి నుంచి బాణసంచా విక్రయాలు