దసరాకు ప్రత్యేక రైళ్లు
విజయవాడ: ప్రయాణికుల సౌకర్యార్థం దసరా పండుగకు కాకినాడ-తిరుపతి-కాకినాడ,
తిరుపతి-నాందేడ్-తిరుపతి మధ్య పలు ప్రత్యేక రైళ్లు నడుపుతామని విజయవాడ
డివిజన్ ఇన్‌చార్జి పీఆర్వో జేవీఆర్‌కే రాజశేఖర్ శనివారం ఒక ప్రకటనలో
తెలిపారు. రైలు నంబరు 07941 కాకినాడ-తిరుపతి ప్రత్యేక రైలు అక్టోబర్ 3, 6,
10, 13, 17, 20, 24, 27, 31 తేదీల్లో రాత్రి 7 గంటలకు కాకినాడలో బయలుదేరి
మరుసటి రోజు ఉదయం 6.20కు తిరుపతి చేరుతుందని పేర్కొన్నారు.
రైలు నంబరు 07942 తిరుపతి-కాకినాడ ప్రత్యేక రైలు అక్టోబర్ 2, 5, 9, 12,
16, 19, 23, 26, 30 తిరుపతిలో రాత్రి 7 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం
5.30 గంటలకు కాకినాడ చేరుతుందని వివరించారు. రైలు నంబరు 07607
నాందేడ్-తిరుపతి ప్రత్యేక రైలు అక్టోబర్ 4, 11 తేదీల్లో సాయంత్రం 6.45
గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి చేరుతుందని, రైలు
నంబరు 07608 తిరుపతి-నాందేడ్ ప్రత్యేక రైలు అక్టోబర్ 5, 12 తేదీల్లో
తిరుపతిలో మధ్యాహ్నం 3.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు
నాందేడ్ చేరుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ టూటైర్,
త్రీటైర్, స్లీపర్ క్లాస్, జనరల్ బోగీలు ఉంటాయని రాజశేఖర్ తెలిపారు.Thank You
Vijayawada TownHub
URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en
Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.
0 thoughts on “దసరాకు ప్రత్యేక రైళ్లు”