తాజా లోకల్ ఈవెంట్స్
Search

Book Fiestival Daily Updates

Day-11 పుస్తక మహోత్సవం


 

Day-10 పుస్తక మహోత్సవం

Day-9 పుస్తక మహోత్సవం






 

Day-8 పుస్తక మహోత్సవం

పుస్తకమహోత్సవ ప్రాంగణం ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. పాఠశాలలకు సెలవు కావడంతో పెద్దలతోపాటు పిల్లలు స్వరాజ్య మైదానంలో సందడి చేశారు. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్దఎత్తున పుస్తకప్రియులు తరలివచ్చారు. తమకు ఇష్టమైన పుస్తకాలను కొనుగోలు చేశారు. అమ్మకాలు బాగా జరిగాయని ప్రచురణకర్తలు, విక్రేతలు సంతోషం వ్యక్తం చేశారు.
  దైనందిన జీవితాలను అధ్యయనం చేస్తూ మానవీయ కోణంలో వచ్చే వ్యాస రచనలు సంఖ్య తగ్గుతుందని కవి, రచయిత, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. వూహాజనిత సాహిత్యం కంటే నిత్యం చైతన్యం రగిలించే సమకాలీన రచనలు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కవిత్వం నినాదంగా మారాలని, సమకాలీన సమస్యలను అధ్యయనం చేస్తూ రచనలు సాగినపుడు ప్రజలకు చేరువగా ఉంటుందని అన్నారు. విజయవాడ బుక్‌ఫెస్టివల్‌ సొసైటీ, ఎన్టీఆర్‌ ట్రస్టు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న నవ్యాంధ్ర పుస్తక సంబరాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం సమాలోచన వేదికపై రచయితల ముఖాముఖి కార్యక్రమం జరిగింది. పత్రికల్లో మన రచన పతాక శీర్షికగా వచ్చినపుడే ఆ కవితకు ప్రాణం ఉంటుందని పలువురు రచయితలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి భవిష్య సంధాన కర్తగా వ్యవహరించారు. గుడిసేవ విష్ణుప్రసాద్‌, సాహిత్యప్రకాష్‌, ఆనందరావు పట్నాయక్‌, డాక్టరు ఎస్వీ సత్యనారాయణ, గుండు సుబ్రమణ్య దీక్షితులు, ఆచార్య వెలమల సిమ్మన్న, అలపర్తి వెంకట సుబ్బారావు, నాగసూరి వేణుగోపాల్‌, డాక్టరు రాధేయ, ధర్భశయనం శ్రీనివాసాచార్య, రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, కంగర మోహన్‌, లోసాని సుధాకర్‌, కుప్పిలి పద్మ, యడవల్లి శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తి కొండ సుబ్బారావు, కార్యదర్శి జివి.పూర్ణచంద్‌, కొల్లూరి తదితరులున్నారు.
పుస్తక మహోత్సవంలో నేటి కార్యక్రమాలు పుస్తక మహోత్సవప్రాంగణం, న్యూస్‌టుడే: మంగళంపల్లి బాలమురళీకృష్ణ సాహిత్య వేదికపై సోమవారం సాయంత్రం 6 గంటలకు కొలనుకొండ శివాజీ రాసిన ఎల్లలెరుగని భారత ఖ్యాతి ఇందిరాగాంధీ పుస్తకాన్ని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఆవిష్కరిస్తారు. ఈ సభకు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అధ్యక్షత వహిస్తారు. చెన్నుపాటివిద్య తదితరులు పాల్గొంటారు.
8 గంటలకు జెపి పబ్లికేషన్‌ వారి ఆస్ట్రోన్యూమరాలజీ పుస్తకావిష్కరణ ఉంటుంది. ప్రతిభా వేదికపై సామంత్రం 6 గంటలకు సంజీవనీ కుసుమ్‌ ద్విభాషా రచన ఖసాగర్‌ సుమన’ను ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ఆవిష్కరిస్తారు. 7గంటలకు గొట్టిపాటి చెంచుబాబు రాసిన దేవతా వస్త్రాలు పుస్తకావిష్కరణ జరుగుతుంది.
సాహిత్యం సత్యానికి ఆలంబన కావాలి పుస్తక మహోత్సవప్రాంగణం, న్యూస్‌టుడే: సాహిత్యం సత్యానికి ఆలంబనగా నిలవాలని, అందుకు సమాజం దోహదం చేయాలని రచయిత, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. ఆదివారం రాత్రి నవ్యాంధ్ర పుస్తక సంబరాల ప్రాంగణంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ వేదికపై రాణా ఆయూబ్‌ రాసిన గుజరాత్‌ ఫైల్స్‌ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ రాజ్యం తలుచుకుంటే రాక్షసాన్ని ఎలా సృష్టించవచ్చో రాణా ఆయూబ్‌ తన పుస్తకంలో వర్ణించారని చెప్పారు. సినీ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో అరసవల్లి కృష్ణ, కొత్తపల్లి రవిబాబు తదితరులు పాల్గొన్నారు.
విభజన సవాళ్లను అందరూ కలసి అధిగమించాలి : మంగళంపల్లి బాలమురళీకృష్ణ సాహిత్య వేదికపై వి.జి.ఎస్‌. సంస్థ ప్రచురించిన ఆంధ్రప్రదేశ్‌ విభజనసవాళ్లు అనే పుస్తకాన్ని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు పుస్తక పరిచయం చేశారు. ఇదే వేదికపై పంచాయతీ కార్యదర్శులు పోటీ పరీక్షల పుస్తకాన్ని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, యూటీఎఫ్‌ పుస్తకాన్ని ఐ.వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. విజిఎస్‌ ప్రచురణ సంస్థ నిర్వాహకులు సూర్యనారాయణ మూర్తి, శివానందమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభావేదికపై మంగళవారం రాత్రి సామవేదం షణ్ముఖశర్మ రాసిన సమాధానమ్‌ పుస్తకాన్ని మాజీ మేయర్‌ జంధ్యాల శంకర్‌ ఆవిష్కరించారు. ఈసభలో గాజుల సత్యనారాయణ, దూళిపాళ్ల రామకృష్ణ,సాయిరాం, రుషి పీఠం సంస్థ ఇన్‌చార్జి రామారావు పాల్గొన్నారు.

Day-7 పుస్తక మహోత్సవం 

‘నా జ్ఞాపకాలు’ పుస్తకావిష్కరణ


 ఆర్థికవేత్త, రిజర్వు బ్యాంకు మాజీ గవర్నరు వైవీ రెడ్డి అనుభవాలు యువతకు మార్గనిర్దేశకాలని వక్తలు అభిప్రాయపడ్డారు. రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ యాగా వేణుగోపాల్‌రెడ్డి రాసిన ‘నా జ్ఞాపకాలు’ పుస్తకాన్ని స్వరాజ్య మైదానంలోని 28వ పుస్తక మహోత్సవంలోని బాల మురళీకృష్ణ వేదికపై శనివారం ఆర్థికవేత్త ప్రేమ్‌చంద్‌ ఆవిష్కరించారు. రిజర్వుబ్యాంకు పూర్వ డిప్యూటీ గవర్నరు వేపా కామేశం, రిజర్వు బ్యాంకు పూర్వ కార్యనిర్వాహక సంచాలకులు ఎ.వాసుదేవన్‌ తదితరులు పాల్గొన్నారు.
పలు పుస్తకావిష్కరణులు

 స్వరాజ్య మైదానంలోని పుస్తక మహోత్సవ ప్రాంగణం మంగళంపల్లి బాల మురళీకృష్ణ సాహిత్య వేదికపై ఎరిక్‌ హబ్స్‌బామ్‌ రాసిన ‘ఆధునిక ప్రపంచ చరిత్ర- విప్లవాలయుగం’ పుస్తకాన్ని ఆచార్య అంజిరెడ్డి ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే కెఎస్‌ లక్ష్మణరావు పరిచయ ప్రసంగం చేశారు. డీఎన్‌ఝూ రాసిన ‘గోవు పవిత్రత కట్టుకథ’ పుస్తకాన్ని నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎన్‌ అంజయ్య ఆవిష్కరించారు. పెరుమాళ్‌ మురుగన్‌ రాసిన ‘అర్ధనారి’ పుస్తకాన్ని కథా రచŒయిత్రి పి.సత్యవతి ఆవిష్కరించారు. ఐద్వా ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి పుస్తక పరిచయం చేశారు. విద్యావేత్త కె.కేశవరెడ్డి, ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ నిర్వాహకులు ఎం.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై ప్రజాశక్తి ప్రచురణలు ‘సమ్మర్‌ హిల్‌- పిల్లల పెంపకంలో సంచలనం’, ‘పిల్లల సంపూర్ణ వికాసానికి పెద్దల సమాజంలో వచ్చే సమస్యలు’, ‘పిల్లల నేర్చుకోవడంలో తల్లిదండ్రులతో వచ్చే సమస్యలు’, ‘పిల్లల నేర్చుకోవడంలో ఉపాధ్యాయులతో, పాఠశాలలో వచ్చే సమస్యలు’ అనే పుస్తకాలను డాక్టరు జి.సమరం ఆవిష్కరించారు. ఈ సభలో విద్యావేత్త శివరాం ముఖ్య ప్రసంగం చేశారు. జనవిజ్ఞాన వేదిక నాయకులు వి.బ్రహ్మారెడ్డి, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, సీనియర్‌ జర్నలిస్టు సుంకర రామచంద్రరరావు, సీవీ కృష్ణయ్య తదితరులు ప్రసంగించారు.

ప్రతిభా వేదికపై శనివారం రాత్రి మహీధర మురళీ మోహనరావు రాసిన ‘కత్తుల వంతెన’ పుస్తకాన్ని విశాలాంధ్ర పూర్వ సంపాదకులు రాఘవచారి, జగన్నాథ శర్మ రాసిన ‘రామాయణం’ పుస్తకాన్ని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ఆవిష్కరించారు. ‘మొదటిపేజి’ ‘కంఠగాడి కాశీయాత్ర’ పుస్తకాలను ఆవిష్కరించారు. కేంద్ర సాహీతీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్‌ మాట్లాడుతూ.. మానవ విలువల్ని కాపాడుతూ రచనలు సాగించాలని సూచించారు. విశాలాంధ్ర సంపాదకులు గడ్డం కోటేశ్వరరావు, రచయిత దివికుమార్‌, కవి సంధ్య ఎడిటర్‌ శిఖామణి తదితరులు పాల్గొన్నారు. 

Day-6 పుస్తక మహోత్సవం



 



 






Vijayawada TownHub Team met With BBA President Mr.Ch.Manmadha Rao Gaaru

 A fine evening with Mr.Ch Manmadha Rao Gaaru (BBA President) at Vijayawada Book Festival 2017 and he asked about our Vijayawada TownHub Response and he is very much impressed with our app performance. 

Thank you very much Sir for your valuable time to spend with us -- VTH

Vijayawada Book Festival Society President Ballepu Babjee Gaaru visited out stall and  asked about daily updates and our Vijayawada TownHub app performance.

   Day-5 పుస్తక మహోత్సవం





 

 


Day-4 పుస్తక మహోత్సవం

పుస్తక ప్రియుల పాదయాత్ర:
 విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన పుస్తక ప్రియుల పాదయాత్రకు వారి నుంచి విశేష స్పందన లభించింది. గాంధీనగర్‌లోని ప్రెస్‌ క్లబ్‌ నుంచి ప్రారంభమైన ఈ యాత్రకు ప్రముఖ మానసిక శాస్త్రవేత్త బివి.పట్టాభిరామ్‌ పచ్చజెండాను వూపి ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రదర్శనగా పుస్తక మహోత్సవ ప్రాంగణానికి చేరుకున్నారు. రిజర్వు బ్యాంకు పూర్వ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు యాత్రకు నాయకత్వం వహించారు. ఆచార్య గోపాలగురు, మాలేపల్లి లక్ష్మయ్య, జి.వల్లీశ్వర్‌, నగేష్‌కుమాం, విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం అధ్యక్షులు బి.బాబ్జి, ఉపాధ్యక్షులు లక్ష్మయ్య, కార్యదర్శి సాయిరామ్‌, ఎన్టీఆర్‌ ట్రస్టు సీఈఓ విష్ణు, ఎక్స్‌రే సాంస్కృతిక సంస్థ కొల్లూరి తదితరులు పాల్గొన్నారు. చైల్డ్‌లైన్‌, కేర్‌అండ్‌షేర్‌, నవజీవన్‌ బాలభవన్‌, ఎస్‌కేసీవీ, చిల్డ్రన్‌ ట్రస్టు, గుణదల బెతల్‌ మినిస్ట్రీస్‌, సిద్ధార్థా ఆర్ట్స్‌ కాలేజి, సిద్ధార్థ అకాడమీ, సిద్ధార్థా మహిళా కళాశాల, విద్యార్థులు పాల్గొన్నారు.

పుస్తక మహోత్స ప్రాంగణం: సామాజిక, వ్యక్తిగత జీవితంలోనూ మోహన దాస్‌ గాంధీ, మహాత్మా గాంధీగా మారిన స్ఫూర్తి అజరామరం అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. పుస్తక మహోత్సవంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ సాహిత్య వేదికపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస రచయిత, మానసిక నిపుణులు బీవీ పట్టాభిరామ్‌ రాసిన ‘మ్యాజిక్‌ ఆఫ్‌ మహాత్మా’ అనే పుస్తకాన్ని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కె.ప్రభాకరరెడ్డి ఆవిష్కరించారు. దేశ స్వాతంత్య్రానికి కారణమైన మహాత్మాగాంధీ వ్యక్తిత్వ నైపుణ్యాలను అందరూ అధ్యయనం చేయాలని సూచించారు. రిజర్వుబ్యాంకు పూర్వ గవర్నరు దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ.. మనిషి మనసులో మానవత్వాన్ని తట్టి లేపడంలో పట్టాభిరాం పుస్తకాలు దోహదపడతాయన్నారు. పుస్తకాన్ని అంకితం తీసుకున్న రాష్ట్ర శాసనసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ.. మహాత్ముడి గొప్పదనాన్ని వ్యక్తిత్వ వికాస కోణంలో చూపిన పట్టాభిరామ్‌ కృషి ప్రశంసనీయమన్నారు. పట్టాభిరామ్‌ మాట్లాడుతూ.. వ్యక్తి శీలంలో ప్రాథమికాంశాలైన దృక్పథం, ప్రవర్తన, భావ వ్యక్తీకరణ, క్రమశిక్షణను ఉన్నతస్థాయిలో నిర్వహించిన వ్యక్తి గాంధీ అని వివరించారు. గాంధీ జీవితంలో మానసిక శాస్త్రం, నిర్వహణా శాస్త్రం తదితరాలకు సంబంధించిన మూలసూత్రాలన్నీ ఆచరణలో గమనించవచ్చన్నారు. మానసిక శాస్త్రవేత్తలంతా మహాత్మాగాంధీ జీవిత చరిత్రను లోతుగా చదివి తీరాలని సూచించారు. 

 

Day-3 పుస్తక మహోత్సవం

 

Day-2 పుస్తక మహోత్సవం




Day -1 పుస్తక మహోత్సవం ప్రారంభం


Eenadu: జనవరి 11 వరకు కొనసాగనున్న ప్రదర్శన నీ హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు

 విజయవాడ పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజే పుస్తకాభిమానులు తరలివచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. గతానికి భిన్నంగా అనేక కొత్త స్టాళ్లు సైతం ఈసారి ప్రదర్శనలో కొలువుదీరాయి. చిన్నారుల పుస్తకాల మొదలు... అన్ని రకాల సాహిత్యం అందుబాటులో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం స్టాళ్లలోని పుస్తకాలను చూసి మంచి పుస్తకాలను ఉంచారంటూ మెచ్చుకున్నారు. జనవరి 11వ తేదీ వరకూ పుస్తక ప్రదర్శన కొనసాగుతుందని విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ (వీబీఎఫ్‌ఎస్‌) అధ్యక్షులు బెల్లపు బాబ్జీ వెళ్లడించారు. అన్నిరకాల పుస్తకాలూ అందుబాటులో ఉన్నాయని, కొన్ని అరుదైనవీ దొరుకుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాలలో మాత్రమే దొరికే అరుదైన ప్రచురణ సంస్థలు సైతం తరలివచ్చి పుస్తక స్టాళ్లను ఏర్పాటు చేశాయి. నిత్యం మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ పుస్తకాల ప్రదర్శన అందరికీ అందుబాటులో ఉంటుటంది. ప్రవేశానికి ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా వచ్చి స్వేచ్ఛగా పుస్తకాలను చూసి వెళ్లొచ్చు. కొనుగోలు చేయాలనుకుంటే కొనొచ్చు. ప్రతి పుస్తకంపై 10శాతం ప్రత్యేక రాయితీని అందిస్తున్నారు.
ఆకట్టే కథ చెప్పే స్టాల్‌.. : పుస్తక ప్రదర్శనలో ఈసారి ఓ కొత్త స్టాల్‌ ఆకట్టుకుంటోంది. కథ చెప్పే స్టాల్‌ పేరుతో దీనిని వినూత్నంగా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో దీనిని నెలకొల్పారు. ఒకప్పుడు ఇళ్లలో బామ్మలు, తాతయ్యలు, నాన్నమ్మలు పిల్లలకు మంచి మంచి కథలను చెప్పేవాళ్లు. చిన్నారులంతా చుట్టూ చేరి ఆసక్తిగా వినేవాళ్లు. ప్రస్తుతం కథలు చెప్పే తాతయ్య, నాన్నమ్మల వద్ద చిన్నారులు ఉండే పరిస్థితి లేదు. కథ గొప్పతనం అంతా ఇంతా కాదని తెలియజేసేందుకు దీనిని నెలకొల్పారు. ఈ స్టాల్‌ వద్దకు వచ్చిన వాళ్లు ఎవరైనా ఏ కథ అయినా చెప్పించుకుని వినొచ్చు. దీంతో చిన్నాపెద్దా అంతా వచ్చి సరదాగా కథలు చెప్పించుకుంటున్నారు. కథను చెప్పడంలో నైపుణ్యం ఉన్న రవి అనే యువకుడు వినసొంపుగా చెపుతున్నాడు. పుస్తకాల ప్రదర్శనలో ఈ స్టాల్‌ ఆకట్టుకుంటోంది.
నాగరిక సమాజానికి ప్రతీక పుస్తక ప్రదర్శన



పుస్తక మహోత్సవ ప్రాంగణం, న్యూస్‌టుడే: నాగరిక సమాజానికి, సంస్కృతికి, సంప్రదాయాలకు పుస్తక ప్రదర్శన ప్రతీకలుగా ఉంటాయని భాషా సమ్మాన్‌ అవార్డు గ్రహీత నాగళ్ల గురు ప్రసాదరావు అన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో ఆదివారం నిర్వహించిన పుస్తక మహోత్సవంలో ఆయన మాట్లాడారు. గత 28 ఏళ్లుగా విజయవాడ పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్నారని... విజయవాడ అభిరుచికి, సంస్కృతికి ఇది ఉత్తమ సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సీఈవో విష్ణు మాట్లాడుతూ.. భావితరాలకు మంచి మార్గదర్శనం చేయడం, సాంకేతిక అభివృద్ధిని సంస్కృతితో సమన్వయం చేయడంలో పుస్తకాలు కీలక పాత్ర వహిస్తాయన్నారు. సమాజంలో పుస్తకాలు, సాహిత్యానికి తగిన స్థానం లభించినప్పుడే సాంకేతిక అభివృద్ధి సద్వినియోగం అవుతుందన్నారు. పుస్తకమహోత్సవ సంఘం అధ్యక్షులు బెల్లపు బాబ్జి మాట్లాడుతూ.. ఈ మహోత్సవంలో కాలానుగుణంగా మార్పులు చేస్తున్నామని, సౌకర్యాలు మెరుగు పరుస్తున్నామని వివరించారు. ప్రముఖ పాత్రికేయులు సి.రాఘవాచారి మాట్లాడుతూ.. విజయవాడ నూతన సంవత్సర వేడుకల్లో, సంస్కృతి సంప్రదాయాల్లో పుస్తక మహోత్సవం విడదీయరాని భాగమైందన్నారు. సంఘం కార్యదర్శి కె.లక్ష్మయ్య సభకు స్వాగతం చెప్పారు.
ప్రామాణిక ప్రచురణలకు గుర్తింపు : 
 అమరావతి ప్రాంతానికి చెందిన ప్రచురణ కర్తల్లో పరుచూరి నరసింహారావు ప్రామాణికమైన ప్రచురణలకు మంచి గుర్తింపు పొందారని వక్తులు కొనియాడారు. సాయంత్రం సాహిత్య వేదికపై పరుచూరి నరసింహారావు సంస్మరణ సభ నిర్వహించారు. విజయవాడ ప్రాంతానికి చెందిన దివంగత ప్రచురణ కర్తల పేరు పుస్తక మహోత్సవ ప్రాంగణానికి పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది గుంటూరుకు చెందిన టెక్నికల్‌ ప్రచురణ సంస్థ అధిపతి పరుచూరి నరసింహారావు పేరు పెట్టారు.

Sakshi:  నేటి నుంచి పుస్తక మహోత్సవం 

పుస్తకాల పండుగ వచ్చేసింది. పాఠన, సాహితీ ప్రియులను అలరించనుంది. నగరంలో ఆదివారం నుంచి పుస్తక మహోత్సవం ప్రారంభం కానుంది. పండుగకు నగరంలోని స్వరాజ్య మైదానం వేదికైంది. విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ, రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖతో పాటు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఈ ఏడాది పండుగలో భాగస్వామ్యం అయ్యింది. పండుగకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సొసైటీ అధ్యక్షుడు బీ బాబ్జీ, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సీఈవో విష్ణు తెలిపారు. ఈ సందర్భంగా 265 దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లుప పేర్కొన్నారు.
సమాలోచనలు
ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సహకారంతో సమకాలీన అంశాలపై ప్రఖ్యాత నిపుణులతో సదస్సులు నిర్వహించనున్నారు. మూడో తేదీ ఐటీ అండ్‌ ఐవోటీ ఆపర్చునిటీస్‌ ఫర్‌ యూత్‌ అంశంపై సదస్సు, 4న రోల్‌ ఆఫ్‌ ఆర్‌బీఐ ఇన్‌ కరెంట్‌ సిట్యూవేషన్‌పై సదస్సు నిర్వహించనున్నారు. 5వ తేదీ ఇన్‌క్లూజివ్‌ డవలప్‌మెంట్‌ అంశంపై, 6న పిడగోజీ అండ్‌ టీచర్‌ ఇన్‌ ది డిజటల్‌ ఏరియా, 7న అండర్‌స్టేడింగ్‌ యువర్‌ మనీ ఏర్పాటు చేశారు. 8న వాటర్‌ అండ్‌ డవలప్‌మెంట్‌ అంశంపై రామన్‌ మెగసేసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్‌ ప్రసంగించనున్నారు.
ప్రభుత్వ శాఖల స్టాళ్లు, వైఫై సదుపాయం
ఈ ఏడాది పుస్తక మహోత్సవంలో మొత్తం 365 స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.
 పుస్తక మహోత్సవ ప్రాంగణంలో జీవో సౌజన్యంతో వైఫై సదుపాయాన్ని అందుబాటులో తీసుకురానున్నారు.
పిల్లలకు ఆటవస్తువులు
పిల్లల సాహిత్యానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించటంతో పాటుగా వారు చదువు కోవటానికి ఆటలు ఆడుకోవటానికి కూడా పుస్తకాలను, ఇతర ఆట వస్తువులను అందుబాటులో ఉంచుతున్నారు.
'నేను – నా సాహిత్యానుభవం'
పుస్తక మహోత్సవంలో ప్రతి రోజూ సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకూ పాఠకులతో సుప్రసిద్ధ రచయితల ఇష్టాగోష్టిని 'నేను – నా సాహిత్యానుభవం' పేరుతో ఏర్పాటు చేశారు.
 హాజరు కానున్న సాక్షి ఈడీ రామచంద్రమూర్తి
 సదస్సులో భాగంగా ఐదో తేదీ ఇన్‌క్లూజివ్‌ డవలప్‌మెంట్‌ అంశంపై నిర్వహించే సదస్సుకు సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి హాజరుకానున్నారు. ఇంకా ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ పొలిటికల్‌ స్టడీస్‌ ఆచార్యులు గోపాల్‌గురు, ప్రముఖ మానవహక్కుల కార్యకర్త, సఫాయి కర్మచారి ఆందోళన్‌ జాతీయ కన్వీనర్‌ బెజవాడ విల్సన్‌, రాష్ట్ర ప్రభుత్వ మాజీ చీఫ్‌ సెక్రటరీ కాకి మాధవరావు హాజరు కానున్నారు.
విజయవాడ పుస్తకమహోత్సవం ప్రారంభంలో సీఎం వెల్లడి
 



సాక్షి, విజయవాడ: ప్రతి జిల్లాలోనూ పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ, భాషా, సాంస్కృతికశాఖ, ఎన్టీఆర్‌ ట్రస్టులు సంయుక్తంగా నిర్వహిస్తున్న 28వ పుస్తకమహోత్సవాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో చంద్రబాబు మాట్లాడుతూ.. ఇప్పటికే అనంతపురం, తిరుపతి, రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు.

ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, సమాజం నాలెడ్జ్‌ సొసైటీగా మారడానికి ఇటువంటి పుస్తకప్రదర్శనలు  ఉపయోగపడతాయని అన్నారు. ఈ విషయాల్లో మీడియా సానుకూల దృక్పథాలతో రాయడం నేర్చుకోవా లని సూచించారు. మంచి సంఘటనలు బాగా పబ్లిష్‌ చేయాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో సమాచారమంతా అందుబాటులో ఉంటున్నప్పటికీ, పుస్తకం చదువుతుంటే పొందే అనుభూతి వేరుగా ఉంటుందన్నారు. పుస్తకం చదవడం ఒక అలవాటుగా పెట్టుకోవాలన్నారు. 
 

*** Invitation of Vijayawada Book Festival 2017 @ PWD Grounds***



Dear Sir / Madam,
Wish You a Happy New Year to All.

You are cordially invited to the 28th "VIJAYAWADA BOOK FESTIVAL"  on 1st Jan 2017, 5 P.M @ PWD Grounds, Vijayawada. Inaugurated by our honourable Chief Minister NARA CHANDRABABU NAIDU Gaaru.

All People around Vijayawada and Book lovers are welcome, hope you all guys use this occasion. Please consider this is our personal invitation to each and every one.
 
Thanks & Regards,
BELLAPU BABJEE,
President of Vijayawada Book Festival Society,

 

A.B Sai Ram
Secretary  of Vijayawada Book Festival Society



Had a great meeting with  Vijayawada Book Festival Society President  B.BABJEE gaaru.
Some pics taken while Vijayawada TownHub team met with him.



Thanks & Regards,







For more information latest events / updates  and lot more... Download Vijayawada TownHub Free Mobile Service App & experience new ways to stay connect with latest happenings in our city.
To Download https://goo.gl/Nd3HWS


TAG

nanomag

Complete information about Local Events in Vijayawada


10 thoughts on “Book Fiestival Daily Updates

    1. Thanks Govt of AP for continuing the exhibition in PWD grounds. That's a great news to book lovers

      ReplyDelete
    2. Excellent, we are looking something like this type Festivals. Thanks VBFS

      ReplyDelete
    3. Excellent sir.. You are doing marvellous job to guide this generation with Books

      ReplyDelete
    4. Sankranthi is festival of farmers. Vijayawada Book Festival is festival of book lovers.All the best for the grand event. ---Avadhanula Hari.

      ReplyDelete
    5. Book festival is a feast to book lovers.It should be the pride of andhrapradesh.

      ReplyDelete
    6. Book festival is a feast to book lovers.It should be the pride of andhrapradesh.

      ReplyDelete
    7. పుస్తక ప్రియులకు గొప్ప విందు. ముఖ్య మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగడం పుస్తక ప్రియులను గౌరవించినట్లే.
      ఆహ్వానం పంపి, ఈ ఉత్సవంలో నన్ను పాల్గొనజేస్తున్న నిర్వాహకులకు ధన్యవాదములు.
      - మాకినీడ్ సూర్య భాస్కర్, కాకినాడ

      ReplyDelete
    8. 2nd Solo Titanium Razor
      The 2nd Solo Razor is made with the Duo titanium chopsticks Rods' apple watch titanium vs aluminum own ultralight design. It titanium white dominus price has a snap-free snap closure, a citizen super titanium armor snap-free handle, and a snap-free titanium mig 170 grip

      ReplyDelete