తాజా లోకల్ ఈవెంట్స్
Search

ఏపీలో ఎస్సై పోస్టుల


ఏపీలో ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల


ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్.. సివిల్ ఎస్సై, ఏఆర్ ఎస్సై, సీపీఎల్ ఆర్‌ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై, డిప్యూటీ జైలర్, అసిస్టెంట్ మేట్రన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 707 పోస్టులు ఉన్నాయి.
విభాగాల వారీగా ఖాళీలు...
పోస్ట్‌కోడ్ నెం.
పోస్టు(స్టైపెండరీ కెడెట్ ట్రైనీ)
ఖాళీలు
11
సివిల్ ఎస్సై (పురుషులు, మహిళలు)
355
12
ఏఆర్ ఎస్సై (పురుషులు, మహిళలు)
113
13
సీపీఎల్ ఆర్‌ఎస్సై (పురుషులు)
9
14
ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై (పురుషులు)
209
51
డిప్యూటీ జైలర్ (పురుషులు)
16
52
అసిస్టెంట్ మేట్రన్ (మహిళలు)
5

విద్యార్హత:
Education News
  • పోస్ట్ కోడ్ 11, 12, 13, 14 పోస్టులకు 2016, జూలై 1 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు ఇంటర్ పూర్తిచేసి, డిగ్రీ చదివి ఉండాలి. డిప్యూటీ జైలర్, అసిస్టెంట్ మేట్రన్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • మహిళలకు సివిల్ పోస్టుల్లో 33.33 శాతం, ఏఆర్ విభాగంలోని పోస్టులకు 20 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఒకవేళ అర్హులైన మహిళా అభ్యర్థులు అందుబాటులో లేకుంటే వారికి రిజర్వ్ చేసిన ఖాళీల్లో అర్హులైన పురుష అభ్యర్థులను నియమిస్తారు.

వయో పరిమితి :
పోస్ట్ కోడ్ 11, 12, 13, 14 పోస్టులకు 2016, జూలై 1 నాటికి 21-27 ఏళ్లు. డిప్యూటీ జైలర్ పోస్టులకు 21-30 ఏళ్లు. అసిస్టెంట్ మేట్రన్ పోస్టులకు 21-25 ఏళ్లు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వారి సర్వీసులకు అనుగుణంగా నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

శారీరక ప్రమాణాలు :
పురుషులు:
పోస్ట్‌కోడ్ 11, 12, 13, 14 పోస్టులకు ఎత్తు కనీసం 167.6 సెం.మీ. ఉండాలి. ఛాతీ 86.3 సెం.మీ. కంటే తక్కువ ఉండకూడదు. పూర్తిగా ఊపిరి తీసుకున్నప్పుడు కనిష్టంగా 5 సెం.మీ.పెరగాలి. అభ్యర్థులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరికి చెందిన ఎస్టీ, ఆదివాసీ తెగలకు చెందితే వారి ఎత్తు కనీసం 160 సెం.మీ., ఛాతీ 80 సెం.మీ. కంటే తక్కువ ఉండకూడదు. శ్వాస తీసుకున్నప్పుడు ఛాతీ కనిష్టంగా 3 సెం.మీ. పెరగాలి.

మహిళలు: పోస్ట్‌కోడ్ 11, 12, 13, 14 పోస్టులకు ఎత్తు కనీసం 152.5 సెం.మీ. బరువు కనీసం 40 కిలోలు ఉండాలి. అభ్యర్థులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలకు చెందిన ఎస్టీ, ఆదివాసీ తెగలకు చెందితే ఎత్తు కనీసం 150 సెం.మీ., బరువు కనీసం 38 కిలోలు ఉండాలి.
  • డిప్యూటీ జైలర్ పోస్టులకు ఎత్తు కనీసం 168 సెం.మీ. ఉండాలి. ఛాతీ 87 సెం.మీ. కంటే తక్కువ ఉండకూడదు. ఎక్స్‌పాన్షన్‌లో కనిష్టంగా 5 సెం.మీ. పెరగాలి. అభ్యర్థులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరికి చెందిన ఎస్టీ, ఆదివాసీ తెగలకు చెందితే ఎత్తు కనీసం 164 సెం.మీ., ఛాతీ 83 సెం.మీ. కంటే తక్కువ ఉండకూడదు. పూర్తి శ్వాస తీసుకున్నప్పుడు ఛాతీ కనిష్టంగా 5 సెం.మీ. పెరగాలి. అసిస్టెంట్ మేట్రన్ పోస్టులకు ఎత్తు కనీసం 153 సెం.మీ. ఉండాలి. బరువు కనీసం 45.5 కిలోలు ఉండాలి.

ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్స్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫైనల్ రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది.

ప్రిలిమినరీ రాత పరీక్ష : అభ్యర్థులు మొదట ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరు కావాలి. రెండు పేపర్లల్లో నిర్వహించే ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రతి పేపర్‌కు మూడు గంటల సమయాన్ని కేటాయిస్తారు.

పరీక్ష విధానం:
పేపర్
సబ్జెక్టు
మార్కులు
పేపర్ 1
అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ (100 ప్రశ్నలు)
100
పేపర్ 2
జనరల్ స్టడీస్ (100 ప్రశ్నలు)
100
  • ఇందులో అర్హత సాధించాలంటే ప్రతి పేపర్‌లో కనీస అర్హత మార్కులు సాధించాలి. ఓసీ అభ్యర్థులు కనీసం 40 శాతం; బీసీలు 35 శాతం; ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు 30 శాతం మార్కులు సొంతం చేసుకోవాలి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియంలో ఉంటుంది. ఇందులో సాధించే మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.

పీఎంటీ, పీఈటీ :
ప్రిలిమినరీ రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్‌మెంట్స్ టెస్ట్ నిర్వహిస్తారు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)కు హాజరవ్వాలి. ఇందులో మూడు ఈవెంట్స్ ఉంటాయి. అవి.. 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, 1600 మీటర్ల పరుగు పందెం.
ఈవెంట్
జనరల్
ఎక్స్‌సర్వీస్‌మెన్
మహిళలు
100 మీటర్ల పరుగు
15 సెకన్లు
16.5 సెకన్లు
18 సెకన్లు
లాంగ్‌జంప్
3.80 మీటర్లు
3.65 మీటర్లు
2.75 మీటర్లు
1600 మీటర్ల పరుగు
8 నిమిషాలు
9 ని॥30 సె.
10ని॥30సె.
  • పోస్ట్ కోడ్ 11, 51, 52 పోస్టులకు అభ్యర్థులు 1600 మీటర్ల పరుగులో తప్పనిసరిగా అర్హత సాధించాలి. దీనితో పాటుగా మిగిలిన వాటిలో ఏదైనా ఒక దాంట్లో అర్హత సాధిస్తే తుది రాత పరీక్షకు ఎంపికవుతారు. పీఈటీ కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
  • మిగిలిన పోస్టులకు (పోస్ట్ కోడ్: 12, 13, 14) ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌లోని అన్ని ఈవెంట్లలో అర్హత సాధించాలి. ఇందులో సాధించే మెరిట్ ఆధారంగా ఈవెంట్లకు మార్కుల వెయిటేజీ ఉంటుంది. వీటికి 100 మార్కులు కేటాయించారు. 100 మీటర్ల పరుగుకు 30 మార్కులు, లాంగ్ జంప్‌కు 30 మార్కులు, 1600 మీటర్లకు 40 మార్కులు ఉంటాయి. మెరిట్ ఆధారంగా మార్కులు కేటాయిస్తారు.

ఫైనల్ రాత పరీక్ష: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఫైనల్ రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు మూడు గంటల సమయం ఉంటుంది.
పేపరు 1
ఇంగ్లిష్
పేపరు 2
తెలుగు
పేపరు 3
అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ
పేపరు 4
జనరల్ స్టడీస్
  • మొదటి రెండు పేపర్లు అర్హత పేపర్లు. డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు వస్తాయి. ఈ రెండు పేపర్లలో వేర్వేరుగా అర్హత సాధించాలి. ఇందులో సాధించిన మార్కులు తుది ఎంపికలో పరిగణలోకి తీసుకోరు. ఈ రెండు పేపర్లలో అర్హత సాధిస్తేనే మిగతా పేపర్ల వాల్యూయేషన్ జరుగుతుంది. పేపర్ 3, పేపర్ 4లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ఇందులో కూడా వేర్వేరుగా కనీస అర్హత మార్కులు సాధించాలి. సివిల్ ఎస్సై, డిప్యూటీ జైలర్, అసిస్టెంట్ మేట్రన్ పోస్టుల భర్తీకి పేపర్-3, 4లను ఒక్కో పేపర్‌ను 200 మార్కులకు.. మొత్తంగా 400 మార్కులకు నిర్వహిస్తారు. మిగిలిన పోస్టులకు పేపర్-3, పేపర్-4లలో వచ్చిన మార్కులను ఒక్కో పేపర్‌ను 100 మార్కులకు మొత్తంగా 200 మార్కులకు గణిస్తారు.
    తుది ఎంపిక ఇలా: నాలుగంచెల ఎంపిక ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసుకున్న అభ్యర్థులను.. ఆయా ప్రక్రియల్లో పొందిన మార్కులు.. అందుబాటులో ఉన్న పోస్ట్‌ల ఆధారంగా తుది మెరిట్ జాబితా రూపొందిస్తారు.
  • సివిల్ ఎస్సై, డిప్యూటీ జైలర్, అసిస్టెంట్ మేట్రన్ తుది జాబితా: 400 మార్కులకు నిర్వహించే ఫైనల్ రిటెన్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా జాబితా రూపొందిస్తారు.
  • ఏఆర్ ఎస్సై, సీపీఎల్ ఆర్‌ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై తుది జాబితా: 200 మార్కులకు నిర్వహించే ఫైనల్ రిటెన్ ఎగ్జామినేషన్‌లో ప్రతిభ, మరో 100 మార్కులకు నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో పొందిన మార్కులను సమ్మిళితం చేసి మొత్తం 300 మార్కుల ప్రాతిపదికగా పొందిన మార్కులతో జాబితా రూపొందిస్తారు.

గమనిక:
  1. సివిల్, ఏఆర్ ఎస్సై పోస్టుల భర్తీ క్రమంలో 30 శాతం పోస్టులను అన్ రిజర్వ్‌డ్ కేటగిరీలో ఓపెన్ కోటా విధానంలో మిగతా 70 శాతం పోస్టులను స్థానిక అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
  2. తుది రాత పరీక్షలోని పేపర్-3, 4లను ఆన్‌లైన్‌లో నిర్వహించే అవకాశం ఉంది.

సిలబస్ స్వరూపం :
  • ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫైనల్ రాత పరీక్షలకు సిలబస్ పరంగా ఒకే అంశాలు పేర్కొనప్పటికీ ఫైనల్ రాత పరీక్షలో ప్రశ్నల క్లిష్టత స్థాయి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

సిలబస్ :
అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ: అర్థమెటిక్‌లో నంబర్ సిస్టమ్, సాధారణ వడ్డీ, చక్ర వడ్డీ, నిష్పత్తులు, సగటు, శాతాలు, లాభ- నష్టాలు, టైం అండ్ వర్క్, వర్క్- వేజేస్, కాలం- దూరం, గడియారాలు - క్యాలెండర్లు, భాగస్వామ్యం, బీజగణితం అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రీజనింగ్‌లో వెర్బల్, నాన్ వెర్బల్‌పై ప్రశ్నలు ఉంటాయి. అనాలజీస్, సిమిలారిటీస్ - డిఫరెన్సెస్, స్పేషియల్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియెంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలసిస్, జడ్జ్‌మెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమొరీ మీద ప్రశ్నలు అడుగుతారు.
  • జనరల్ స్టడీస్: ఇందులో జనరల్ సైన్స్ ప్రాముఖ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో జరిగే డెవలప్‌మెంట్స్, పర్యావరణం అంశంపై ప్రశ్నలు ఉంటాయి. జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి కరెంట్ అఫైర్స్, భారతదేశ చరిత్ర, ముఖ్యంగా నాటి ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలపై అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. భారత జాతీయోద్యమం, భారత భూగోళ శాస్త్రం, ఇండియన్ పాలిటీ, భారత రాజకీయ వ్యవస్థ, ఎకానమీకి సంబంధించి గ్రామీణాభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
  • ఇంగ్లిష్ పేపర్: ఇంగ్లిష్‌లో అభ్యర్థి రైటింగ్ ఎబిలిటీ, ఇంగ్లిష్ అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. షార్ట్ ఎస్సే, కాంప్రెహెన్షన్, ప్రిసైజ్ రైటింగ్, లెటర్ రైటింగ్, పేరాగ్రాఫ్ రైటింగ్/రిపోర్ట్ రైటింగ్, ఇంగ్లిష్ నుంచి తెలుగు/ఉర్దూ అనువదించే సామర్థ్యం పరీక్షిస్తారు.
  • తెలుగు/ ఉర్దూ: అభ్యర్థులు తుది రాత పరీక్షలో పేపర్-2లో తెలుగు లేదా ఉర్దూ ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో అభ్యర్థులు ఆయా భాషలను అర్థం చేసుకునే సామర్థ్యం, రైటింగ్ ఎబిలిటీ, పేరాగ్రాప్ రైటింగ్, తెలుగు నుంచి ఇంగ్లిష్‌లో అనువాదం మొదలైన స్కిల్స్ పరీక్షిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా నిర్దేశిత ఫీజు రూ.600 (ఎస్సీ/ ఎస్టీలైతే రూ.300) ఏపీ ఆన్‌లైన్ లేదా మీసేవా కేంద్రాల్లో లేదా టీఎస్ ఆన్‌లైన్ కేంద్రాల్లో చెల్లించి దానికి సంబంధించిన పేమెంట్ రసీదు పొందాలి. దాని ఆధారంగా రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్లో ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తిచేయాలి.

ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తు:
2016, సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 24 వరకు.
ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీ: 2016, నవంబర్ 27 (పేపర్-1 ఉదయం, పేపర్-2 మధ్యాహ్నం ఉంటుంది).
ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: recruitment.appolice.gov.in
Thank You
Vijayawada TownHub
Please download "Vijayawada TownHub" FREE mobile app either from Google Play Store or Apple Store for more job offers
 


TAG

nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “ఏపీలో ఎస్సై పోస్టుల