|
శ్రీ గాయత్రి దేవి:
“
ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్చాయై ముఖైస్త్రీ క్షణైః యుకామిందు నిబద్ధరత్న
మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్ గాయత్రీం వరదాభయాంకుశకశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధార వింద యుగళం హసైర్వహం తీం భజే “
సకల వేద స్వరూపం గాయత్రీదేవి.
అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు
కలిగిన అయిదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది
శంకరులు గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా అర్పించారు. ప్రాతఃకాలంలో
గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయంసంధ్యలో సరస్వతి గానూ ఈమె
ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో
విఘ్ణవు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను
ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి.
బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది.గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది.
గాయత్రీ మంత్రజపం చతుర్వేదం పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. “ ఓం భూర్భువస్వః
తత్సవితుర్వరేణ్యం భర్లో దేవస్యసధీ మహి ధియో యోనః ప్రచోదయాత్” అనే
మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి. అల్లపుగారె నివేదన చెయ్యాలి.
గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చెయ్యాలి. గాయత్రీ
స్తోత్రాలు పారాయణం చేయాలి.
|
0 thoughts on “ఈ రోజు అమ్మవారి శ్రీ గాయత్రి దేవి అలంకారము”