చక్కటి హావభావాలతో.. మంచి భావవ్యక్తీకరణతో వేదికపై
నిలబడి మాట్లాడాలి.. అందరినీ ఆకట్టుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది.
ఎక్కాలంటే.. పదిమందిలో మాట్లాడాలంటే బిడియం. సరిగ్గా మాట్లాడగలుగుతామా?
లేదా అనే భయంతో వెనుకడుగు వేస్తున్నారు. అటువంటి వారిలో భయాన్ని
పోగొట్టి.. ఆత్మవిశ్వాసాన్ని, చక్కటి నైపుణ్యాన్ని పెంపొందించి వారిని మంచి
వక్తలుగా తీర్చిదిద్దేందుకు వేదికగా నిలిచింది ఈనాడు, ఈతరం క్లబ్. మంచి
వక్తగా మారేందుకు శనివారం ‘ఈనాడు’ ఈతరం క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ
రోడ్డులోని హోటల్ ఫార్చ్యూన్ మురళీ పార్కులో రెండు రోజుల ‘ఉపన్యాస కళ’
శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. శిక్షకులు జీవీఎన్ రాజు అభ్యర్థులకు
భావ వ్యక్తీకరణ నైపుణ్యంపై అవగాహన కలిగించారు. నలుగురిలో మాట్లాడేటప్పుడు
ఎలా నిలబడాలి, ఎలా మాట్లాడాలి, ఎటు వైపు చూస్తూ మాట్లాడాలి, ఆకట్టుకునేటట్లు
ఎలా మాట్లాడాలి వంటి అంశాలను వివరించారు. అభ్యర్థులను నేరుగా వేదికపైన
మాట్లాడించి వారి పొరపాట్లను సరిదిద్దారు. ఉత్తమ మేనేజర్‌గా, పారిశ్రామికవేత్తగా,
బృంద నాయకుడిగా, అధికారిగా, లాయర్‌గా, డాక్టర్‌గా, విద్యార్థిగా రాణించేందుకు
ఉపన్యాసకళ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
Vijayawada TownHub · For more info about Vijayawada, Please Download "Vijayawada TownHub" free mobile app from google play store / apple store.
0 thoughts on “ఉపన్యాస కళతో మంచి వక్తగా మారండి”