**** శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి శ్రీ సరస్వతీ దేవి అలంకారము ****
శ్రీ సరస్వతీ దేవి:
“
ఘంటాశూల హలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జెర్దధతీం ఘనాంత
విలసచ్ఛీతాంశు తుల్య ప్రభామ్ గౌరీదేహ సముద్ఛవాం త్రిజగతామాధారాభూతాం మాహా
పూర్వా మత్ర సరస్వతీ మనుభజే శుంభాది దైత్యార్దినీమ్”
శరన్నవరాత్రులలో
మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది. చదువుల తల్లి సరస్వతీ రూపంలో
దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా
సరస్వతీదేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా
అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయ ముద్రతో భక్తుల అజ్ఞాన
తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు మొదలైన
లోకోత్తర చరిత్రులకు ఈమె వాగ్వైభవాన్ని వరంగా ఇచ్చింది. ఈమెను కొలిస్తే
విద్యార్థులకు చక్కని బుద్ధి వికాసం జరుగుతుంది. త్రిశక్తి స్వరూపాల్లో ఈమె
మూడో శక్తిరూపం. సంగీత,సాహిత్యాలకు అధిష్టాన దేవత. సకల జీవుల
జిహ్మాగ్రంపై ఈమె నివాసం ఉంటుంది.
0 thoughts on “ఈ రోజు అమ్మవారి శ్రీ సరస్వతీ దేవి అలంకారము”