తాజా లోకల్ ఈవెంట్స్
Search

భారత్, న్యూజిలాండ్ మూడో వన్డే నేడు

*** ఇదే కీలకం ***

ఇదే కీలకం
భారత్, న్యూజిలాండ్ మూడో వన్డే నేడు
గెలిచిన జట్టుకు సిరీస్‌పై పట్టు
బ్యాటింగ్ పిచ్ సిద్ధమంటున్న క్యురేటర్ 

ఏకపక్షంగా సాగుతుందనుకున్న సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు రసవత్తరంగా మార్చేసింది. రెండో వన్డేలో విజయం సాధించడం ద్వారా తమ సత్తా చాటి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. ఐదు వన్డేల సిరీస్‌లో చెరో మ్యాచ్ గెలిచినందున... మూడో వన్డేలో విజయం ఇరు జట్లకూ కీలకం. ఇందులో గెలిచిన జట్టుకు సిరీస్‌పై పట్టు దొరుకుతుంది. తొలి రెండు వన్డేలకు భిన్నంగా ఈసారి భారీగా పరుగులు వస్తాయని క్యురేటర్ చెబుతున్నారు. మరి మొహాలీ ఎవరి వైపు మొగ్గుతుందో..!
మొహాలీ: భారత్‌ను సొంతగడ్డపై 13 సంవత్సరాల తర్వాత ఓడించిన ఉత్సాహంలో న్యూజిలాండ్... స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబాటు ద్వారా షాక్ తిన్న భారత్... మరో వన్డే పోరుకు సిద్ధమయ్యారుు. పంజాబ్ క్రికెట్ సంఘం (పీసీఏ) స్టేడియంలో ఆదివారం జరిగే మూడో వన్డేలో రెండు జట్లూ తలపడనున్నారుు. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడినా సిరీస్ గెలవాలంటే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి తీరాల్సి ఉంటుంది. అలాంటి చావోరేవో పరిస్థితిలోకి వెళ్లకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో గెలవాలి. ఇదే లక్ష్యంతో ఇరు జట్లు బరిలోకి దిగుతున్నారుు.
మార్పుల్లేకుండానే ధోనిసేన
తొలి రెండు వన్డేలు ఆడిన జట్టుతోనే భారత్ ఈ మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం ఉంది. రెండో వన్డే సందర్భంగా రోహిత్‌కు గాయమైనా... శనివారం సుదీర్ఘ సమయం ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. కాబట్టి తను అందుబాటులో ఉన్నాడని జట్టు తెలిపింది. అటు రైనా జ్వరం నుంచి ఇంకా కోలుకోలేదు. కాబట్టి జాదవ్ స్థానం కూడా పదిలం. బౌలింగ్ విభాగం రెండు వన్డేల్లోనూ తమ బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తించింది. కానీ రెండో వన్డేలో బ్యాటింగ్ వైఫల్యం భారత్‌ను విజయానికి దూరం చేసింది. రోహిత్, మనీశ్ పాండే ఇద్దరూ ఇప్పటి వరకూ తమ స్థారుుకి తగ్గ ఆట చూపెట్టలేదు. కోహ్లి, రహానే, పాండ్యా ఫామ్‌లో ఉన్నారు. జాదవ్, ధోని ఇద్దరూ మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంది. మూడేళ్ల క్రితం చివరిసారిగా మొహాలీలో జరిగిన వన్డేలో ధోని సెంచరీ చేశాడు. మళ్లీ ఆ తరహా ఇన్నింగ్‌‌స కెప్టెన్ నుంచి రావలసి ఉంది. ఏమైనా రెండో వన్డేలో ఓటమితో భారత జట్టు నేలకు దిగింది. ఇక అందరూ బాధ్యతగా ఆడాల్సిన సమయం వచ్చేసింది.
జోరు మీద కివీస్
వరుస పరాజయాలతో చప్పగా సాగిపోతున్న పర్యటనలో ఢిల్లీ విజయం న్యూజిలాండ్ జట్టులో ఉత్సాహం పెంచింది. కెప్టెన్ విలియమ్సన్ ఒంటరి పోరాటంతో సెంచరీ చేసి సహచరుల్లో స్ఫూర్తిని పెంచాడు. ఓపెనర్ లాథమ్, రోంచీ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్‌‌స ఆడలేదు. ముఖ్యంగా సీనియర్లు గప్టిల్, రాస్ టేలర్ జట్టుకు భారంగా మారారు. అరుునా కానీ ఈ ఇద్దరి అనుభవం వల్ల తుది జట్టులో కొనసాగుతారు. ఇక బౌలింగ్ విభాగంలో ఢిల్లీలో ఆ జట్టు ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్‌నే ఆడించింది. పేస్ బౌలర్లంతా అద్భుతంగా బౌలింగ్ చేసి ఓ మాదిరి లక్ష్యాన్ని కూడా కాపాడుకున్నారు. ముఖ్యంగా బౌల్ట్ అత్యద్భుతంగా బౌలింగ్ చేశాడు. సౌతీ కూడా తన అనుభవన్నంతా చూపించాడు. కాబట్టి మూడో వన్డేకు న్యూజిలాండ్ కూడా మార్పులు లేకుండానే బరిలోకి దిగొచ్చు. ఒకవేళ అదనంగా స్పిన్నర్ కావాలనుకుంటే డెవిచ్ స్థానంలో సోధి జట్టులోకి రావచ్చు.
 జట్లు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, రహానే, కోహ్లి, మనీశ్, జాదవ్, పాండ్యా, మిశ్రా, అక్షర్, ఉమేశ్, బుమ్రా.
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, లాథమ్, టేలర్, అండర్సన్, రోంచీ, శాన్‌ట్నర్, డెవిచ్, సౌతీ, హెన్రీ, బౌల్ట్.
పిచ్, వాతావరణం
పిచ్ మీద కొంత పచ్చిక కనిపిస్తున్నా మ్యాచ్ సమయానికి అది ఉండదని, భారీ స్కోర్లు ఆశించవచ్చని క్యురేటర్ దల్జీత్ సింగ్ చెప్పారు. వర్షం ప్రమాదం లేదు. కాకపోతే రెండో ఇన్నింగ్‌‌స సమయంలో మంచు ప్రభావం ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
గత మ్యాచ్‌లో పాండ్యాకు మద్దతుగా ఒక్కరు నిలబడి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ప్రతి మ్యాచ్‌లోనూ గెలవగల సత్తా మాకు ఉంది. దురదృష్టవశాత్తు గత మ్యాచ్‌లో మా సామర్థ్యానికి తగ్గట్లుగా ఆడలేదు. రెండో వన్డేలో చేసిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకుంటాం. -అమిత్ మిశ్రా (భారత స్పిన్నర్)
ఫలితం ఎలా ఉన్నా మా సన్నాహాలు ఒకేలా ఉంటారుు. విజయాలు రాని సమయంలో కుంగిపోలేదు. విజయాలు వస్తే గర్వపడేదీ లేదు. ఢిల్లీతో పోలిస్తే మొహాలీలో పరిస్థితులు మాకు అనుకూలంగా ఉన్నారుు. జట్టులో ఎవరి ఫామ్ గురించీ ఆందోళన లేదు.
-సౌతీ (న్యూజిలాండ్ పేసర్)
8 మొహాలీలో భారత్ ఇప్పటివరకూ
13 వన్డేలు ఆడితే ఎనిమిది గెలిచి,  ఐదు ఓడిపోరుుంది.
3 చివరిసారిగా మొహాలీలో ఆడిన వన్డేలో భారత్ ఓడినా...
అంతకుముందు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ధోనిసేన గెలిచింది.

మ. గం. 1.30 నుంచి  స్టార్‌స్పోర్‌‌ట్స-1లో ప్రత్యక్ష ప్రసారం

Vijayawada TownHub ·
For more info about Vijayawada, Please Download "Vijayawada TownHub" free mobile app from google play store / apple store.



nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “భారత్, న్యూజిలాండ్ మూడో వన్డే నేడు