తాజా లోకల్ ఈవెంట్స్
Search

Interview with RGV

*** వంగవీటి రాధా..తెలుగులో నా ఆఖరు సినిమా ***
రామ్ గోపాల్ వర్మ..సంచలన దర్శకుడే కాదు..సంచలన కామెంటేటర్ గా మారిపోయారు..తన ట్వీట్ ల ద్వారా. ఆయన ఇప్పుడు వంగవీటిరాధా అనే సినిమాను అందిచబోతున్నారు.
వంగవీటి రాధా మీ ఆఖరు సినిమా అన్నది నిజమేనా?
తెలుగులో నా ఆఖరి ఫీచర్ ఫిల్మ్ అదే. ఇప్పుడు నేను గత ముంబాయిలో వుంటున్నాను. గత నెలలోనే షిఫ్ట్ అయిపోయాను.
ఇప్పుడు ఈ సినిమా తీయడం వెనుక మీ ఉద్దేశం?
వంగవీటి రాధా అనే సబ్జెక్ట్ ఎప్పటి నుంచో నా మదిలో వుంది. నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. నేను విజయవాడలోనే చదివాను..పెరిగాను. చలసాని వెంకటరత్నం, రాధా, రంగా, దేవినేని, ఇలా అందరి గురించీ తెలసు..
అంటే మరో రక్త చరిత్ర మాదిరిగానా?
అలా అని కాదు. ఇందులో హీరోయిజం వుండదు. ఎమోషనల్ క్యారెక్టర్లు మాత్రం వుంటాయి. మరో సత్య సినిమా మాదిరిగా వుంటుంది.
పవన్ విషయంలో మీ అసంతృప్తి ఏమిటి?
ఓ వ్యక్తి తన ఉద్దేశాలు ప్రకటిస్తూ పార్టీ పెట్టారు. ఏడాదో, ఏడాదిన్నరో గడిచింది. మరి ఇప్పటివరకు ఆ ఐడియాలజీ, లేదా ఆ ప్రసంగానికి అనుగుణంగా ఏం చేసినట్లు? ఎవరో ఒకరు అడగాలి కదా?
మీరు ట్వీట్ లు చేయడం అందుకేనా?
నేను ట్వీట్ లు ఊరికనే చేయను..అలా అని అనుకుంటారు. రోజంతా పని చేసి వచ్చి, ప్రశాంతంగా కూర్చుని, ఆ రోజు ఏం జరిగింది అన్నది అంతా ఆలోచించి, నా అభిప్రాయాలు నిర్మొహమాటంగా ట్వీట్ చేస్తా అంతే.
Vijayawada TownHub ·
For more info about Vijayawada, Please Download "Vijayawada TownHub" free mobile app from google play store / apple store.



nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “Interview with RGV