ఈ నోటును చూస్తే ఒక్కోరికి ఒక్కోటి గుర్తుకు వస్తోంది. చిన్నపిల్లలు ఆడుకొంటుంటారే.. చైల్డ్ కరెన్సీ.. ఆ తరహాలో ఉంది ఈ నోటు అనే అభిప్రాయం మాత్రం గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు.. ఇది చిరిగిపోవడం కూడా చాలా సులభం అనిపిస్తోంది. ఇంత తేలికగా, పలుచగా ఉన్న నోటు మీద తేమ పడితే అదేమవుతుందో ముందు ముందు తెలుస్తుంది. చిరిగిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉందేమో అనిపిస్తోంది ఈ నోటును తాకి చూస్తే.
చిప్ అబద్ధం అని ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు అర్థం చేసుకోవాలి. ఈ నోట్ చిప్ ఉండబోతోంది.. దీని వల్ల దొంగ నోట్లకు అవకాశం ఉండదని .. అది కూడా దేశభక్తే అని ఫీలయిన వాళ్లు కొత్త నోటులో చిప్ లేదని అర్థం చేసుకోవాలి.
ఈ సంగతులన్నీ ఇలా ఉంటే.. ఇప్పుడు బ్యాంకుల్లో కరెన్సీ మార్చుకున్న వారికి, డబ్బులు డ్రా చేసుకోని వస్తున్న వారికి చిత్రవిచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. చాలా బ్యాంకుల్లో కరెన్సీ కొరత ఉంది. నాలుగు వేల రూపాయలు పరిమితి మేరకు నోట్లను అడుగుతుంటే.. రెండు వేల రూపాయల నోట్లు రెండింటిని చేతిలో పెడుతున్నారు! అదేమంటే.. వెయ్యి నోటు లేదు, ఐదువందల రూపాయల నోట్లు అయిపోయాయి, వంద, యాభైలు కూడా లేవు. ఉన్నవి రెండు వేల రూపాయల నోట్లు మాత్రమే! కాబట్టీ ఇవే తీసుకెళ్లండని తాపీగా చెబుతున్నారు.
మరి అలా తీసుకొచ్చిన నోటుతో ఏం చేయాలి? టీ తాగడానికో, టిఫిన్ తినడానికో వెళ్లి ఆ నోటును ఇస్తే.. సదరు హోటల్ యజమానులు చిల్లర ఇస్తామంటున్నారు, అయితే పాత వెయ్యి రూపాయలు, ఐదువందళ్లు ఇస్తారట! వాటిని తీసుకుని ఏం చేసుకోవాలి? మళ్లీ బ్యాంకు వెళ్లి మార్చుకుందామా అంటే.. అప్పటికే నాలుగు వేల రూపాయల పరిమితికి చేరాం కాబట్టి.. బ్యాంక్ కొత్త నోట్లను ఇవ్వదు!
ఇప్పుడు పరిస్థితుల్లో రెండు వేల రూపాయలకూ షాపింగ్ చేస్తే తప్ప.. ఆ నోటు మార్పించడం సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఏటీఎంలలో ఎక్కడా ఇంకా డబ్బు కనిపించడం లేదు. షట్టర్లు క్లోజ్ చేసే ఉన్నాయి. రెండు రోజుల సెలవు తీసుకుని కూడా.. అంతకన్నా ముందు నుంచినే బ్యాంకులకు నగదును చేరావేశామని ఆర్బీఐ ప్రకటించినా కూడా.. నేటికీ ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడానికి తగినంత డబ్బును కూడా అందించలేకపోయారు. దీంతో గందరగోళ పరిస్థితే కొనసాగుతోంది. మరి ఈ గందరగోళం ఎన్నటికి సద్దుమణిగేనో!
Vijayawada TownHub ·
Please download "Vijayawada TownHub" mobile app from below url https://play.google.com/store/apps/details…
or http://eventstownhub.blogspot.in/p/latest-jobs.html#
or http://eventstownhub.blogspot.in/p/latest-jobs.html#
0 thoughts on “ఏం చేసుకుందాం ఈ రెండు వేల నోటుతో..”