ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. రూ. ఐదు
వందలు, రూ. వెయ్యి నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మంగళవారం
అర్ధరాత్రి నుంచి ఈ నోట్లు కేవలం కాగితాలు మాత్రమే ఆయన స్పష్టం చేశారు. ఈ
నేపథ్యంలో ఈ కరెన్సీ నోట్లు ఉన్న ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని
నిపుణులు చెప్తున్నారు. ఈ నోట్లు కలిగిన ప్రజలు రానున్న రోజుల్లో ఏం
చేయాలంటే..
- బుధవారం (నవంబర్ 9) నాడు అన్ని బ్యాంకులు పనిచేయబోవు.
- ప్రస్తుతం మీవద్ద ఉన్న రూ. 500, రూ. వెయ్యినోట్లను డిసెంబర్ 30, 2016లోపు బ్యాంకులు, పోస్టాఫీసులలో డిపాజిట్ చేయవచ్చు. ఇలా డిపాజిట్ చేసే నగదు విషయంలో ఎలాంటి పరిమితి లేదు.
- ఈ నెల 24 వరకు హేడ్ పోస్టాఫీస్ లేదా సబ్ పోస్టాఫీస్‌లలో గుర్తింపు కార్డు చూపించి పాత రూ. 500, రూ. వెయ్యినోట్లను బదిలీ చేసుకోవచ్చు. ఇక్కడ రూ. 4,000 పరిమితి ఉంటుంది.
- ప్రస్తుతం బ్యాంకు నుంచి ఉపసంహరించే నగదు విషయంలో రోజుకు రూ. 10వేలు, నెలకు రూ. 20వేలు పరిమితి ఉంటుంది. దీనిని రానున్న రోజుల్లో పెంచవచ్చు.
- చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్స్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపుల విషయంలో, ఇంటర్నెట్ బ్యాంకింగ్ విషయంలో ఎలాంటి పరిమితులు ఉండబోవు.
ఆ నోట్లు ఇక్కడ చెల్లుతాయి!
- అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ రూ. 500, రూ. వెయ్యినోట్ల చెలామణి అవుతాయి
- అదేవిధంగా రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లు, ఆర్టీసీ బస్సులు, విమాన బుకింగ్ కౌంటర్లు, పెట్రోల్ బంకులలో ఇవి చెలామణి అవుతాయి.
Please download free app : Vijayawada Townhub from Google play store/apple store.
https://goo.gl/Nd3HWS
https://goo.gl/Nd3HWS
0 thoughts on “ఆ నోట్లు చిత్తుకాగితాలే.. ప్రజలు ఏం చేయాలంటే?”