తాజా లోకల్ ఈవెంట్స్
Search

శ్రీవారి నిత్యోత్సవాలు

శ్రీవారి నిత్యోత్సవాలు

మన విజయవాడ నగరము లో శ్రీలక్ష్మీ శ్రీనివాస సేవాసమితి ఆధ్వర్యంలో స్వరాజ్యమైదానంలో శ్రీవారి నిత్యోత్సవాలు ఆదివారం ఉదయం ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు జనవరి 22 నుండి 28 వరకు జరుగును. శ్రీవారి నిత్యోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీ పౌండరీక మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు,
రోజు వారి శ్రీవారి కార్యక్రమాలు "నిత్యం శ్రీవారి కల్యాణం", "స్వామివారికి నిత్య ఉత్సవాలు", "ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు", 10వేల మందికి అన్నదానం. కావున భక్తులందరూ శ్రీవారి ని దర్శించి స్వామివారి కృపా కరుణ కటాక్షములు పొందగలరు
.

శ్రీలక్ష్మీ పౌండరీక మహాయజ్ఞం నిర్వహణ

శ్రీలక్ష్మీ శ్రీనివాస సేవాసమితి ఆధ్వర్యంలో స్వరాజ్యమైదానంలో శ్రీవారి నిత్యోత్సవాలు ఆదివారం ఉదయం ప్రారంభం కానున్నాయి. శ్రీవారి నమూనా ఆలయం, కల్యాణ మండపం, సాంస్కృతిక కార్యక్రమాల వేదిక, ఆధ్యాత్మిక ప్రవచనాల వేదికలతో ఏడు రోజుల పాటు శ్రీవారి నిత్యోత్సవాలను నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు గణపతి సచ్చిదానంద స్వామి, కేంద్ర మంత్రి రావ్‌ ఇంద్రజిత్‌సింగ్‌యాదవ్‌ తదితరులు ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. శ్రీవారి నిత్యోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీ పౌండరీక మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. త్రిమూర్తి స్వరూపంగా మూడు వేదాలను కలిగి చంద్రుని ఆకారంలో హోమగుండాలను నిర్మించి శ్రీలక్ష్మీ పౌండరీక మహాయజ్ఞం నిర్వహించనున్నారు.
నిత్యం శ్రీవారి కల్యాణం: శ్రీవారి నిత్యోత్సవాల్లో భాగంగా రోజూ ఉదయం 11గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రోజూ 200 మంది దంపతులు ఈ కల్యాణోత్సవంలో ఉచితంగా పాల్గొనవచ్చు. కల్యాణంలో పాల్గొన్న దంపతులకు శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, పసుపు కుంకుమ అందించనున్నారు.
స్వామివారికి నిత్య ఉత్సవాలు: తిరుమలలో నిర్వహించే విధంగా స్వామి వారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు. తొలి రోజు ఉదయం 8 గంటలకు ఈ ఉత్సవాలు ప్రారంభించనున్నారు. ఆ తరువాత రోజు ఉదయం 5 గంటల నుంచి స్వామి వారి నిత్య సేవలు ప్రారంభ¼మవుతాయి. సుప్రభాత సేవ, విశ్వరూపదర్శనం, తోమాల సేవ, కొలువు, సహస్ర నామార్చన, సర్వదర్శనం, మొదటి గంట నివేదన, సహస్ర దీపాలంకరణ, తిరుమాడ వీధి ఉత్సవాలు నిర్వహిస్తారు. రాత్రి 9.30 గంటలకు ఏకాంత సేవలో ముగుస్తాయి.
ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు : రోజూ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయి. 22న బాచుపల్లి సంతోష్‌కుమార్‌ ప్రవచనం, నాట్యాచార్య చింతా రవిబాలకృష్ణ బృందంతో మోహినీ భస్మాసుర నృత్యరూపకం ఉంటాయి. రోజూ రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు స్వాములు, పీఠాధిపతులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని భక్తులకు అభిభాషణ చేస్తారు.
10వేల మందికి అన్నదానం : శ్రీవారి నిత్యోత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ 10వేల మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించే ఈ అన్నదాన కార్యక్రమంలో రోజుకు 10వేల మందికి స్వామి వారి తీర్ధప్రసాదాలు అందేలా ఏర్పాట్లు చేశారు. ప్రజలు, శ్రీవారి భక్తులు కార్యక్రమాల్లో పాల్గొనాలని శ్రీవారి నిత్యోత్సవాల నిర్వాహకులు గరిమెళ్ల నానయ్య చౌదరి, దూపుగుంట శ్రీనివాసరావు, మామిడి లక్ష్మీవెంకట కృష్ణారావు, ఉదయగిరి శ్రీనివాసబాబు వెల్లడించారు.  




 


Thanks & Regards,







For more information latest events / updates  and lot more... Download Vijayawada TownHub Free Mobile Service App & experience new ways to stay connect with latest happenings in our city.
To Download https://goo.gl/Nd3HWS


TAG

nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “శ్రీవారి నిత్యోత్సవాలు