తాజా లోకల్ ఈవెంట్స్
Search

పంచారామాలకు ప్రత్యేక బస్సులు

పంచారామాలకు ప్రత్యేక బస్సులు

పంచారామాలకు ప్రత్యేక బస్సులు
కార్తీకమాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం పంచరామాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ జాన్‌ సుకుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అమరావతిలోని అమరారామం, భీమవరంలోని సోమారామం, పాలకొల్లులోని క్షీరారామం, ద్రాక్షారామంలోని దక్షారామం, సామర్లకోటలోని కుమార భీమేశ్వరం స్వామివార్లను ఒక్క రోజులో దర్శించుకునే వీలుగా ఆర్టీసీ ఈ సర్వీసులు ఏర్పాటు చేసింది. ప్రతి ఆది, సోమవారాల్లో వేకువజామున 3, 4 గంటలకు పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ నుంచి బస్సు బయల్దేరుతుంది. అమరావతిలోని అమరేశ్వరస్వామి దర్శనంతో ప్రారంభమై సామర్లకోటలో దర్శనానంతరం తిరిగి రాత్రి 11 గంటల సమయంలో బస్టాండ్‌కు తిరిగి వస్తుంది.
టికెట్‌ ధర
సూపర్‌ లగ్జరీలో పెద్దలకు రూ.880, రిజర్వేషన్‌కు అదనంగా రూ.20, చిన్నపిల్లలకు రూ.660, రిజర్వేషన్‌కు రూ.20, అల్ట్రా డీలక్స్‌ సర్వీసుల్లో పెద్దలకు రూ.840, పిల్లలకు రూ.630, రిజర్వేషన్‌కు అదనంగా రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారు. టికెట్‌లు పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ రిజర్వేషన్‌ కౌంటర్లలో, ఆర్టీసీ ఏటీబీ ఏజెంట్ల దగ్గర, ఆన్‌లైన్‌లో (డబ్లు్యడబ్లు్యడబ్లు్య.ఎపిఎస్‌ఆర్‌టిసిఆన్‌లైన్‌.ఇన్‌)లో పొందవచ్చు. పంచరామాలకు వెళ్లే బస్సుల కోసం బస్టాండ్‌ ఎరైవల్‌లోని 55 నుంచి 60వ నంబర్‌ ప్లాట్‌ఫాంలు కేటాయిస్తున్నారు.
ముందస్తు ఏర్పాట్లు
ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఆయా ఆలయాల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల దర్శనం కోసం, వారికి తగిన సమయపాలనపై ప్రత్యేక విధానం ఏర్పాటు చేస్తున్నారు. ముందురోజు రాత్రి ఆలయాల అధికారులతో ఆర్టీసీ సిబ్బంది చర్చిస్తారు. దీనిప్రకారం అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది బస్సు డ్రైవర్లకు, ప్రయాణికులకు సహకరిస్తారు. వివరాలకు ఆర్టీసీలోని 99592 25475, 99592 25467 నంబర్లలో సంప్రదించాలి

Vijayawada TownHub ·
For more info about Vijayawada, Please Download "Vijayawada TownHub" free mobile app from google play store / apple store.nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “పంచారామాలకు ప్రత్యేక బస్సులు