తాజా లోకల్ ఈవెంట్స్
Search

ఈ రోజు అమ్మవారి శ్రీ మాహాలక్ష్మీ దేవి అలంకారము

**** శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి శ్రీ మాహాలక్ష్మీదేవి అలంకారము ****


Sri Mahalakshmi  

శ్రీ మాహాలక్ష్మీదేవి:

“ లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగం ధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక  దీపాంకురాం  శ్రీ మన్మంద కటాక్ష లబ్థ విభవద్ర్చహ్మేంద్ర  గంగాధరాం త్వాం త్రైలోక్యం కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం ’’
కమలాలను రెండు చేతులతో ధరించి అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి  సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మీ. ఈమె క్షీరాబ్ధి పుత్రిక. డోలాసురుడనే రాక్షసుడ్ని సంహరించిన దేవత. శక్తిత్రయంలో ఈమె మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.  ‘యాదేవీ సర్వభూతేఘ లక్ష్మీరూపేణ సంస్థితా’ అంటే అన్ని జీవులలోను  ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీసప్తశతి చెబుతోంది.కాబట్టి శరన్నవరాత్రులలో మహాలక్ష్మీ దేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. “ ఓం శ్రీం హ్రీం క్లీంమహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూర్ణాలు నివేదన చెయ్యాలి. లక్ష్మీ యంత్రాన్ని పూజించాలి.ఎరుపు రంగు పూలతో పూజించాలి. లక్ష్మీ    స్తోత్రాలు పఠించాలి.

Thank You 
Vijayawada TownHub 

URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en 
 Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more. 



nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “ఈ రోజు అమ్మవారి శ్రీ మాహాలక్ష్మీ దేవి అలంకారము