తాజా లోకల్ ఈవెంట్స్
Search

ఈ రోజు అమ్మవారి శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి అలంకారము

****శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి అలంకారము****

Sri Lalitha Tripura Sundari  

శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి:

“ ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశమ్ ఆకర్ణదీర్ఘ నయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వల  ఫాలదేశమ్ ‘’
త్రిపురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టానదేవతగా లలిత త్రిపురసుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె.  చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీ దేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దార్రిద్య దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వర్యాభీష్టాలను ఈమె సిద్ధింపజేస్తుంది. ఈమె శ్రీవిద్యా స్వరూపిణి. సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు (ముతైదువలు)  ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.  శ్రీ చక్రానికి కుంకుమార్చన చెయ్యాలి. లలితా అష్టోత్తరంతో పూజించాలి. “ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ‘’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మాంగల్యభాగ్యం కోరుతూ సువాసినులను  పూజ చెయ్యాలి.

Thank You 
Vijayawada TownHub 

URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en 
 Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.   

 nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “ఈ రోజు అమ్మవారి శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి అలంకారము