తాజా లోకల్ ఈవెంట్స్
Search

అమరావతి షాపింగ్‌ ఫెస్టివల్‌కు తరలిరండి

****అమరావతి షాపింగ్‌ ఫెస్టివల్‌కు తరలిరండి****
వ్యాపారసంస్థల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఆహ్వానం 
 జిల్లా కలెక్టర్‌ పిలుపు
 
 
 గవర్నర్‌పేట (విజయవాడ), న్యూస్‌టుడే: అక్టోబరు 7 నుంచి 28 వరకు జరిగే అమరావతి షాపింగ్‌ ఫెస్టివల్‌-2016లో ఔత్సాహిక వ్యాపారస్థులు పాల్గొనాలని జిల్లా కలెక్టర్‌ బాబు.ఎ. తెలిపారు. అక్టోబరు 6న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అమరావతి ఫెస్టివల్‌ను లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు.
దుకాణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు : అమరావతి షాపింగ్‌ ఫెస్టివల్‌లో షాపుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కోరారు. ఆసక్తి ఉన్న వారు డబ్లు్యడబ్లు్యడబ్లు్య.ఎఎస్‌ఎఫ్‌2016.ఓఆర్‌జీ అనే వెబ్‌సైట్‌ను సందర్శించి వారి పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. స్పాన్సర్‌షిప్‌ నమోదు ఇతర వివరాల కోసం 8008576984, 9866996403 నెంబర్లను సంప్రదించాలని మున్సిపల్‌ కమిషనర్‌ జి.వీరపాండియన్‌ కోరారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ కలసి రావాలని పర్యాటకంగా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం ఉండాలని కోరారు.
అలరించిన నాలుగో రోజు సంగీతవిభాగరి : అమరావతి ఫెస్టివల్‌ ముందస్తు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గత నాలుగు రోజులుగా స్వరాజ్యమైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు సినిమా నేపధ్య యాంకర్‌ హెచ్‌.ఎస్‌.హరితేజ ఆధ్వర్యంలో వంశీధర్‌, నాగార్జున, స్వాతి, పల్లవి, చరణ్‌లు ఆలపించిన గేయాలు ప్రేక్షకులను రంజింప చేశాయి.

Thank You
Vijayawada TownHub

URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en
Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.  nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “అమరావతి షాపింగ్‌ ఫెస్టివల్‌కు తరలిరండి