తాజా లోకల్ ఈవెంట్స్
Search

9 నుంచి అంతర్‌ జిల్లాల మినీ ఆర్చరీ పోటీలు

****9 నుంచి అంతర్‌ జిల్లాల మినీ ఆర్చరీ పోటీలు****

ఈ నెల 9వ తేదీ నుంచి నూజివీడు ధర్మ అప్పారావు కళాశాలలో ఆంధ్రప్రదేశ్‌ అంతర్‌జిల్లాల బాల, బాలికల మినీ ఆర్చరీ పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎండీ అంజద్‌ అలీ తెలిపారు. వివిధ జిల్లాలకు చెందిన ఆర్చరీ క్రీడాకారులు కాంపౌండ్‌, రికర్వ్‌, ఇండియన్‌ రౌండ్‌ విభాగాల్లో పోటీ పడతారని చెప్పారు. నవంబరు 11 నుంచి 14 వరకు తిరుపతిలో నిర్వహించే మినీ జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్టును ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలిపారు. పదేళ్ల లోపు బాల, బాలికలకు కిడ్స్‌ ఆర్చరీ పోటీలను ప్రప్రథమంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ఆర్చరీ అసోసియేషన్‌, విజయవాడ ఓల్టా ఆర్చరీ అసోసియేషన్‌, ధర్మ అప్పారావు కళాశాల సంయుక్తంగా వీటిని నిర్వహిస్తోంది. రాష్ట్రపతి అవార్డు గ్రహీత కె.జ్యోత్స్న, యంగెస్ట్‌ ఆర్చర్‌ ఆఫ్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గ్రహీత చెరుకూరి డాలీ శివాని ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు పీడీ తెలిపారు

Thank You
Vijayawada TownHub

URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en

 Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.  
 


TAG

nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “9 నుంచి అంతర్‌ జిల్లాల మినీ ఆర్చరీ పోటీలు