తాజా లోకల్ ఈవెంట్స్
Search

అమెరికా అధ్యక్ష ఎన్నికలు: తాజా పరిస్థితి


అమెరికా అధ్యక్ష ఎన్నికలు: తాజా పరిస్థితి
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తాజా ముఖచిత్రమిది. ప్రక్రియ మొదలైన నాటి నుంచి వెనుకబడి, చివరి పది రోజుల్లో అనూహ్యంగా పుంజుకుని, పక్కా డెమోక్రటిక్ రాష్ట్రాలను సైతం తన వైపునకు తిప్పుకున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయానికి ఎంత దూరంలో ఉన్నాడు? మొదటి నుంచీ ఆధిక్యంలో కొనసాగుతోన్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్.. విజయానికి అవసరమైన 'ఒక్క రాష్ట్రాన్ని' గెలుచుకుంటారా? పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన తరుణంలో అమెరికా సహా ప్రపంచమంతటా ఉత్కంఠ రేపుతోన్న 'వైట్ హౌస్ పోరు'లో కొన్ని కీలకమైన అంశాలను గమనిస్తే..

ప్రజలు ఓట్లు వేసి గెలిపించే అమెరికా ఎలక్టోరల్ కాలేజీ అధ్యక్షుణ్ని ఎన్నుకుంటుందని, ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 538 ఓట్లు ఉండగా మెజారిటీ (270 ఓట్లు) సాధించిన అభ్యర్థి అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారని తెలిసిందే. ప్రఖ్యాత వార్తా సంస్థ సీఎన్ఎన్ తాజాగా(అమెరికా కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి నాటికి) సేకరించిన వివరాల ప్రకారం హిల్లరీ ఖాతాలో 268 ఓట్లున్నాయి. 17 రాష్ట్రాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని, మరో 5 రాష్ట్రాల్లో అనుకూలతను సంపాదించిన ఆమె.. ఊహించని పరిణామాలు తలెత్తితేతప్ప అమెరికా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా గెలుపొందడం దాదాపు ఖరారయినట్లే. కానీ..

మంగళవారం(నవంబర్ 8)నాటి పోలింగ్ కు ముందు గంటల వ్యవధిలో పరిస్థితి పూర్తిగా మారిపోయినా ఆశ్చర్యపోనవసరంలేదు. ఎందుకంటే అవతల రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ప్రభంజనంలా దూసుకొస్తున్నాడుమరి! సోమవారం రాత్రి నాటికి ట్రంప్ కు 204 ఎలక్టోరల్ ఓట్లు పడటం ఖాయంగా తేలింది. ఆ మేరకు 20 రాష్ట్రాల్లో గట్టి పట్టును సాధించిన రిపబ్లికన్ పార్టీ మరో 5 రాష్ట్రాల్లో అనుకూలతను సాధించింది. మంగళవారం హోరాహోరీ పోరు జరగనున్న ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ అన్నింటిలోనూ నెగ్గుకొస్తేతప్ప అధ్యక్ష పీఠాన్ని అధిరోహించలేడు.హోరాహోరీ పోరు ఎక్కడంటే..
అమెరికాలోని చాలా రాష్ట్రాల ఓటర్లు ఇప్పటికే రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలో ఏదో ఒకదానికి మొగ్గు చూపగా ఆరు రాష్ట్రాల్లో మాత్రం హోరాహోరీ పోరు సాగనుంది. ఇక ‘బ్యాటిల్ గ్రౌండ్'గా అభివర్ణిస్తోన్న ఆరు రాష్ట్రాలలే (18 ఓట్లున్న ఒహాయో, 11 ఎలక్టోరల్ ఓట్లున్న ఆరిజోనా, 29 ఓట్లున్న ఫ్లోరిడా, 6 ఓట్లున్న నెవెడా, ఒక్క ఎలక్టోరల్ ఓటున్న నెబ్రాస్కా రెండో సభ, 15 ఓట్లున్న నార్త్ కరోలినాలే) అమెరికా అధ్యక్షుణ్ని నిర్ణయించడంలో కీలకం కానున్నాయి.

కాగా, కొద్ది గంటల కిందట మారిన సమీకరణాలను బట్టి.. ఒహాయో(18 ఓట్లు), యుటా(6 ఓట్లు) రిపబ్లికన్లకు అనుకూలంగా మారిపోయినట్లు తెలిసింది. నిన్నటిదాకా రిపబ్లికన్లకు అనుకూలంగా ఉన్న న్యూ హాంప్ షైర్(4 ఓట్లు) కొద్ది గంటల కిందటే బ్యాటిల్ గ్రౌండ్ గా మారింది. అయితే సోమవారం అర్ధరాత్రి జరిగిన సంప్రదాయ మిడ్ నైట్ ఓటింగ్ లో న్యూహాంప్ షైర్ లో ట్రంప్ ఆధిక్యాన్ని సాధించడం గమనార్హం.

పక్కా రిపబ్లికన్ రాష్ట్రాలు(ఎలక్టోరల్ ఓట్లు): అలబామా(9), అలస్కా(3), ఆర్కన్సా(6), ఐడహా(4), ఇండియానా(11), క్యాసస్(6), కెంటకీ(8), లూసియానా(8), మిసిసిప్పి(6), మిస్సోరి(10), మాంటెనా(3), నెబ్రాస్కా(4), నార్త్ డకోటా(3), ఒక్లహామా(7), సౌత్ కరోలినా(9), సౌత్ డకోటా(3), టెన్నెస్సీ(11), టెక్సాస్(38), వెస్ట్ వర్జీనియా(5), వయోమింగ్(3). మొత్తం 157 ఎలక్టోరల్ ఓట్లు.
రిపబ్లికన్ పార్టీ(ట్రంప్)కి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలు: జార్జియా(16), అయోవా(6) మెయిన్ రెండో ప్రతినిధి సభ(1) స్థానాల్లో మొదటి నుంచి ట్రంప్ ఆధిక్యత కొనసాగుతోంది. కాగా, కొద్ది గంటల కిందట చోటుచేసుకున్న మార్పుల్లో బ్యాటిల్ గ్రౌండ్ గా ఉన్న ఒహాయో (11), యుటా(6 ఓట్లు) లు కూడా రిపబ్లికన్లకు అనుకూలంగా మారాయి. రిపబ్లికన్లకు అనుకూలంగాఉన్న మొత్తం ఓట్లు  204

డెమోక్రటిక్ పార్టీ(హిల్లరీ)కి జై కొట్టిన రాష్ట్రాలు(ఎలక్టోరల్ ఓట్లు): కాలిఫోర్నియా(55), కనెక్టికట్(7), డెలావెర్(3), వాషింగ్టన్- డీసీ(3), హవాయి(4), ఇల్లినాయిస్(20), మెయిన్(3), మేరీలాండ్(10), మాసచుసెట్స్(11), న్యూజెర్సీ(14), న్యూయార్క్(29), ఆరెగాన్(7), రోడ్ ఐలాండ్(4), వెర్మాంట్ (3), వాషింగ్టన్(12), మిన్నెసొటా(10), న్యూమెక్సికో(5)
డెమోక్రటిక్ పార్టీకి మొగ్గుచూపుతోన్న రాష్ట్రాలు: రిపబ్లికన్లకు అనుకూలంగా ఉన్న న్యూహాంప్ షైర్(4 ఓట్లు) స్థానంలో కొద్ది గంటల కిందటినుంచే హిల్లరీ గాలి వీస్తోంది. దీంతో ఈ రాష్ట్రంలో హోరాహోరీ పోరు జరగనుంది. ఇది కాక కొలరాడో(9), మిచిగన్(16), పెన్సిల్వేనియా(20), వర్జినియా(13) విస్ కాన్సిస్ (10) రాష్ట్రాలు హిల్లరీకి అనుకూలంగా ఉన్నాయి. హిల్లరీకి అనుకూల ఓట్లు మొత్తం 268.
ప్రస్తుత బలాబలాలు ఓటర్లు ఓటువేసే క్షణానికి తారుమారయ్యే అవకాశాలు లేకపోలేవు.
Please download free app : Vijayawada Townhub from Google play store/apple store.
https://goo.gl/Nd3HWSnanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “అమెరికా అధ్యక్ష ఎన్నికలు: తాజా పరిస్థితి