**** హైస్కూళ్లలో డిజిటల్ బోధన ****
ఇప్పటివరకు ప్రైవేటు పాఠశాలలకే పరిమితమైన
డిజిటల్ తరగతి గదులు ఇకనుంచి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అందుబాటులోకి
వస్తున్నాయి. విద్యాశాఖ, ప్రవాసాంధ్రు (ఎన్‌ఆర్‌ఐ)ల సంయుక్త భాగస్వామ్యంతో
ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలో వెయ్యి ప్రభుత్వ హైస్కూళ్ళలో
వీటిని ఏర్పాటు చేస్తోంది. దీనిలో భాగంగా కృష్ణాజిల్లాలో 18హైస్కూళ్ళలో
డిజిటల్ తరగతులను ఏర్పాటు చేశారు. దశలవారీగా వీటి సంఖ్య పెరగనుంది.
తెరపై అత్యాధునిక రీతిలో బోధన
– కనీసం 300 మంది విద్యార్థులున్న హైస్కూళ్ళను ఈ డిజిటల్ తరగతుల
ఏర్పాటుకు ఎంపికచేశారు. విద్యార్థులకు వీడియో, ఆడియో విధానంలో పాఠాలను
బోధిస్తారు.
– ప్రతి సబ్జెక్టుకు వారానికి మూడు గంటల పాటు నిర్వహిస్తారు.
–ఎంపికైన హైస్కూళ్ళ నుంచి ఇరువురు చొప్పున ఉపాధ్యాయులకు నిర్వహణపై శిక్షణనివ్వడం జరిగింది.
– ఆ స్కూళ్లలో ఇప్పటికే ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు రెండు
కంప్యూటర్లు, ప్రొజెక్టర్, ప్రింటర్, గోడకు అమర్చే తెర, యూపిఎస్‌లను
ఏర్పాటు చేశారు.
– ఈ నెల 15వ తేదీన తరగతులను ప్రారంభిస్తారు.
జిల్లాలో డిజిటల్ హైస్కూళ్ళు ఇవే
జిల్లాలో 18 హైస్కూళ్ళను విద్యాశాఖ అధికారులు ఎంపికచేశారు. వాటిలో
నందిగామ, జీ కొండూరు మండలం వెలగలేరు, ఏ కొండూరు మండలం కంభంపాడు, గంపలగూడెం,
విస్సన్నపేట, విజయవాడ రూరల్ మండలం నున్న, సత్యన్నారాయణపురంలోని ఏకేటీపీ
ఎంసీహెచ్ స్కూల్, పెనమలూరు, ఈడుపుగల్లు, గన్నవరం బాలుర, బాలికల, ఉంగుటూరు
మండలం తేలప్రోలు, ఉయ్యూరు, మొవ్వ, మచిలీపట్నం మండలం చిన్నాపురం, పామర్రు,
గుడ్లవల్లేరు మండలం కౌతవరం, ముదినేపల్లి హైస్కూళ్ళు ఉన్నాయి.
0 thoughts on “హైస్కూళ్లలో డిజిటల్ బోధన”