పోలీసు
అమరవీరుల త్యాగాలు అజరామరం
ఎస్పీ విజయ్‌కుమార్
కలెక్టరేట్ (మచిలీపట్నం),
న్యూస్‌టుడే: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు అజరామరమని
జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల
ముగింపు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో
కవాతు నిర్వహించి, గౌరవవందనం సమర్పించి, నివాళులర్పించారు. అమరవీరుల
స్మారకస్థూపం వద్ద పుష్పగుచ్ఛాలుంచినఎస్పీ, ఏఎస్పీ సాగర్ వారి త్యాగాలను
స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అమరవీరుల
సంస్మరణ దినోత్సవ నిర్వహణకు సంబంధించిన కారణాలను వివరించారు.
సమాజ సంక్షేమమే ధ్యేయంగా విధి నిర్వహణలో అసువులబాసిన వారందరికీ
ఘన నివాళులర్పించారు. గతేడాది అక్టోబరులో రోడ్డు ప్రమాదానికి గురై
చికిత్స పొందుతూ మరణించిన ఏఎస్సై ఎండి.జాన్‌పాషా కుటుంబసభ్యులను
పరామర్శించి శాఖపరమైన సహాయ సహకారాలను అందజేశారు. పాఠశాలల్లో
విద్యార్థులకు వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలైన వారికి బహుమతులను,
ప్రశంసాపత్రాలను, నగదు పురస్కారాలను అందజేశారు. బందరు పట్టణంలో
ర్యాలీని ఎస్పీ పచ్చజెండా వూపి ప్రారంభించారు.
Vijayawada TownHub · For more info about Vijayawada, Please Download "Vijayawada TownHub" free mobile app from google play store / apple store.
0 thoughts on “పోలీసు అమరవీరుల త్యాగాలు అజరామరం”