**** ఈ వీక్ ట్రేడ్ టాక్ ****
పబ్లిక్ టాక్, తొలి వారం వసూళ్ల వల్ల ప్రేమమ్‌కి లాంగ్ రన్ ఉంటుందని అనుకున్నారు. కానీ ప్రేమమ్ కేవలం హిట్ స్టేటస్‌తో సరిపెట్టుకునేలా ఉంది. ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి, బడా హీరోల జాబితాలో చేరతాడని ఫాన్స్ ఆశించారు కానీ నాగచైతన్యకి మరోసారి మామూలు విజయమే దక్కింది. అయితే వరుసపెట్టి ఫ్లాప్‌లు ఇచ్చిన తర్వాత అతనికి ఈ చిత్రం ఊరటనిచ్చింది.
నాగభరణం చిత్రానికి ఓపెనింగ్ బాగానే వచ్చింది కానీ దారుణమైన టాక్ రావడంతో ముందుకెళ్లలేకపోయింది. ఈవారంలో ఇజం, నందిని నర్సింగ్ హోమ్ తదితర చిత్రాలు అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. మరి వీటిలో దేనికి ప్రేక్షకామోదం దక్కుతుందనేది చూడాలి.
For more info about Vijayawada, Please Download "Vijayawada TownHub" free mobile app from google play store / apple store
0 thoughts on “ఈ వీక్ ట్రేడ్ టాక్”