నవ్యాంధ్ర పుస్తక సంబరాలు - బెల్లపు బాబ్జీ, వీబీఎఫ్‌ఎస్ అధ్యక్షులు
గత 27 ఏళ్లుగా చేస్తున్న పుస్తక మహోత్సవాన్ని ఈ ఏడాది పలురకాల మార్పు చేర్పులతో ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానంగా ప్రభుత్వం, ఎన్టీఆర్ ట్రస్ట్‌ల భాగస్వామ్యంతో నవ్యాంధ్ర పుస్తక సంబరాలుగా వీటిని నిర్వహించబోతున్నాం. మారుతున్న కాలానికి తగ్గట్టుగా నిర్వహణ విషయంలోనూ మార్పులు చేసుకుంటూ వెళ్తున్నాం. అందుకే నేటికీ పుస్తక ప్రియులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. సాహిత్యానికి పెద్దపీట వేసేలా ఈసారి వేడుకలను నిర్వహిస్తున్నాం.
For booking Stall, please contact President Babji Gaaru (99891 23311)
360 స్టాళ్లు.. లక్షల ప్రచురణలు
Dear Sir / Madam,
Wish You a Happy New Year to All.
You are cordially invited to the 28th "VIJAYAWADA BOOK FESTIVAL" on 1st Jan 2017, 5 P.M @ PWD Grounds, Vijayawada. Inaugurated by our honourable Chief Minister NARA CHANDRABABU NAIDU Gaaru.
All People around Vijayawada and Book lovers are welcome, hope you all guys use this occasion. Please consider this is our personal invitation to each and every one.
Thanks & Regards,
BELLAPU BABJEE,
President of Vijayawada Book Festival Society,
Vijayawada
ఏటా జనవరి మాసంలో సంక్రాంతి సంబరాలకు ముందు విజయవాడలో జరిగే మరో వేడుక పుస్తక మహోత్సవం. గత రెండున్నర దశాబ్దాలకు పైగా దిగ్విజయంగా ఇది కొనసాగుతోంది. రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి ఈ పండగకు పుస్తకాభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. బయట ఎక్కడా లేని విధంగా ప్రత్యేక రాయితీపై అందిస్తుంటారు. దీంతో ఏడాదంతా డబ్బులు దాచుకుని మరీ ఇక్కడ కొనుగోలు చేసుకునేవారు వేలసంఖ్యలో ఉంటారు. కొత్త సంవత్సరం ప్రారంభం రోజు నుంచే పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచేలా గొప్ప సంస్కృతిని విజయవాడ పుస్తక ప్రదర్శన నిర్వాహకులు కొనసాగిస్తున్నారు. స్థానిక స్వరాజ్య మైదానంలో జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు జరిగే ఈ ప్రదర్శన మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. గత మహోత్సవాలకు భిన్నంగా, అనేక మార్పులు, ఆధునిక సాంకేతికత మిళితంగా ఈ ఏడాది 28వ సంబరం జరగబోతోంది.ప్రభుత్వంతో కలిసి తొలిసారి.. పుస్తక పండగను ఇప్పటివరకూ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ (వీబీఎఫ్‌ఎస్) ఒక్కటే దశాబ్దాలుగా నిర్వహిస్తోంది. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, ఎన్టీఆర్ ట్రస్టుల సంయుక్త భాగస్వామ్యంలో నిర్వహిస్తున్నారు. గిరిజన సంక్షేమశాఖ, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, సర్వశిక్ష అభియాన్, సెర్ü్ఫ వంటి ప్రభుత్వ విభాగాలు సైతం ప్రత్యేకంగా ఒక్కొక్కరూ నాలుగు స్టాళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నాయి. గతంలో 230 స్టాళ్లను ఏర్పాటు చేయటంతో కొందరికి స్టాళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉండేది. ఈసారి 360 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది కంటే 130 స్టాళ్లు అదనంగా వస్తున్నాయి. ఏటా మాదిరిగానే లాటరీ పద్ధతిలో స్టాళ్లను కేటాయిస్తున్నారు. 8 లక్షల పుస్తక ప్రియులు..
తాజా పుస్తక మహోత్సవంలో అనేక నూతన మార్పులు చోటుచేసుకున్నాయి. స్టాళ్లు పెరగడంతో పాటు దేశవిదేశీ ప్రచురణ సంస్థలన్నింటినీ రప్పిస్తున్నారు. గత ఏడాది సుమారు ఐదు లక్షల మంది పుస్తకాభిమానులు తరలివచ్చారు. ఈసారి కనీసం ఎనిమిది లక్షల మంది తరలివచ్చేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భాషా సాంస్కృతికశాఖ సహా పలు ప్రభుత్వ విభాగాలు భాగస్వాములుగా వ్యవహరిస్తుండటంతో వేడుకకు మరింత కళ రానుంది.
ఈసారి పిల్లలకు ప్రత్యేకం
ఏటా పుస్తకాల పండుగకు తరలివచ్చే వారిలో చిన్నారులు సైతం భారీ సంఖ్యలో ఉంటారు. ప్రత్యేకంగా తల్లిదండ్రులు వారి పిల్లలకు పుస్తకపఠనం అలవాటు చేయాలనే ఆలోచనతో తీసుకుని వస్తుంటారు. అయితే పిల్లల కోసం ప్రత్యేకంగా ఓ చోట స్టాళ్లను ఏర్పాటు చేయడం అనేది ఇప్పటివరకూ జరగలేదు. తొలిసారి 28వ మహోత్సవంలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా పుస్తకాలన్నింటిని ఒకేదగ్గర ఏర్పాటు చేస్తున్నారు. 2వేల అడుగుల వైశాల్యం(20 స్టాళ్లు పట్టే స్థలం)లో బాలల సాహిత్యం, పుస్తకాలను ఏర్పాటు చేస్తున్నారు.
200 మంది రచయితలు
రాష్ట్రంతో పాటు దేశమంతటా ఉన్న 200 మంది ప్రముఖ రచయితలను ఈసారి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. వారి సాహిత్య కృషి, అనుభవాలను వివరించే ఏర్పాటు చేశారు. చర్చాగోష్ఠిలు నిర్వహించేందుకు మూడు వేల అడుగుల్లో ఓ భారీ హాలును సైతం పుస్తక మహోత్సవ ప్రాంగణంలో సిద్ధం చేస్తున్నారు. ఏపీ రచయితల సంఘానికి ఒక స్టాల్‌ను ఉచితంగా ఇస్తున్నారు.
అరుదైన ప్రచురణలన్నీ..
ప్రపంచంలోని అన్ని ప్రముఖ రచనలూ పుస్తక మహోత్సవంలో కొలువుదీరనున్నాయి. సాధారణంగా ఎక్కడో ఒక్కచోట దొరికే అరుదైన ప్రచురణలూ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సాహిత్యం, భక్తి, సాంకేతిక, విజ్ఞానం, వైజ్ఞానిక, చరిత్ర, బాలలకు ప్రత్యేకంగా.. ఇలా అన్ని రకాల పుస్తకాలు వేల సంఖ్యలో ఒకేచోట కొలువుదీరనున్నాయి. ఒక్కో స్టాల్‌లో ఐదు వేల పుస్తకాలు పడతాయి. ఏ పుస్తకాల దుకాణాల్లోనూ కనిపించని అరుదైన ప్రచురణ సంస్థలు సైతం ఏటా వీబీఎఫ్‌లో తమ స్టాళ్లను ఏర్పాటు చేస్తుంటాయి. గత రెండు మూడేళ్లుగా సీడీల రూపంలోనూ పుస్తకాల విక్రయాలు పెరిగాయి.
11రోజులు విక్రయాలు
పుస్తక మహోత్సవాన్ని జనవరి 1న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. జనవరి 1 నుంచి 11 వరకూ నిత్యం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది. పుస్తక పండగ జరిగే ప్రాంగణానికి, వేదికకు ఏటా ఒక్కొక్క దివంగత ప్రముఖుడి పేరును పెడుతుంటారు. ఈసారి పరుచూరి నర్సింహారావు పేరును పెట్టారు. ఈయన టెక్నికల్ పబ్లిషర్స్ అధినేత, వీబీఎఫ్ గ్రంథాలయం దాతలలో ఒకరు. సాహిత వేదికకు ప్రముఖ కళాకారులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరు పెడుతున్నారు.
సాహిత్య వేడుకగా..
ఈ ఏడాది ప్రదర్శనను ‘సాహిత్య వేడుక’ పేరుతో నిర్వహిస్తున్నారు. దీనికోసం ప్రదర్శన జరిగే ప్రాంగణంలో నిత్యం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకూ మేధోమదన సదస్సులు నిర్వహిస్తారు. 200 మంది రచయితలు రోజుకు కొందరు చొప్పున వచ్చి వీటిలో పాల్గొంటారు. సాయంత్రం 4 నుంచి 6 వరకు ప్రాంగణంలో ఏర్పాటు చేసే సాహిత్య వేదికపై పుస్తకావిష్కరణలు, సాహిత్య సమీక్షలు, ఆలిండియా రేడియో కార్యక్రమాలు జరుగుతాయి. పాఠశాల, కళాశాల విద్యార్థులకు క్విజ్ వంటి కార్యక్రమాలను ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. చివరి రోజున వీరందరికీ బహుమతుల ప్రదానం ఉంటుంది.
పుస్తక ప్రియుల పాదయాత్రకు దువ్వూరి..
పఠనాసక్తిని పెంచడం కోసం వీబీఎఫ్‌ఎస్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో పుస్తక ప్రియుల పాదయాత్రను జనవరి 4న నిర్వహిస్తారు. ఈసారి ఈ పాదయాత్రకు రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సారథ్యం వహించనున్నారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్ నుంచి పుస్తక మహోత్సవం జరిగే ప్రాంగణం వరకు ఈ పాదయాత్ర జరుగుతుంది. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, విద్యావంతులు, కళాకారులు, రచయితలు, ఇలా అన్ని వర్గాలవారు పాల్గొననున్నారు.
నగదు రహిత లావాదేవీలు..
పెద్దనోట్ల రద్దు ప్రభావంతో చిల్లర సమస్య ఏర్పడిన నేపథ్యంలో తొలిసారిగా పుస్తక మహోత్సవంలోని స్టాళ్లలో స్వైపింగ్ యంత్రాలను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అవకాశం ఉన్న పెద్ద ప్రచురణ సంస్థలన్నింటికీ వారినే తెచ్చుకోమని సూచించారు. మిగతా వారికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో మాట్లాడి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం అధ్యక్షులు బెల్లపు బాబ్జీ వెళ్లడించారు. మొబైల్ ఏటీఎంను ఏర్పాటు చేస్తున్నారు. స్వరాజ్య మైదానంలో వేడుక జరిగే 11 రోజులూ ఉచిత వైఫై సదుపాయాన్ని అందుబాటులో ఉంచుతున్నారు.
Had a great meeting with Vijayawada Book Festival Society President B.BABJEE gaaru.
Some pics taken while Vijayawada TownHub team met with him.
For more information latest events / updates and lot more... Download Vijayawada TownHub Free Mobile Service App & experience new ways to stay connect with latest happenings in our city.
To Download https://goo.gl/Nd3HWS
0 thoughts on “పుస్తకాల పండగొచ్చేస్తోంది”