తాజా లోకల్ ఈవెంట్స్
Search

హోరా హోరీగా వాలీబాల్‌ పోటీలు

****హోరా హోరీగా వాలీబాల్‌ పోటీలు****
 
విజయవాడ క్రీడలు: ద.మ.రైల్వే విజయవాడ డివిజన్‌ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా డివిజన్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 11వ డీఆర్‌ఎం కప్‌ వాలీబాల్‌ టోర్నీలో జట్లు హోరా హోరీగా తలపడుతున్నాయి. లీగ్‌ కమ్‌ సూపర్‌ లీగ్‌ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో రెండో రోజైన మంగళవారం రాయనపాడు వర్క్‌షాపు జట్టుపై ఎలక్ట్రికల్‌ (జీఎస్‌) జట్టు, డీఎల్‌ఎస్‌ జట్టుపై ఇంజినీరింగ్‌ జట్టు, ఆపరేటింగ్‌ జట్టుపై ఆర్పీఎఫ్‌ జట్టు, కమర్షియల్‌ జట్టుపై మెకానికల్‌ (సీ అండ్‌ డబ్లు్య) జట్టు, ఎలక్ట్రికల్‌ లోకో షెడ్‌ జట్టుపై రాయనపాడు వర్క్‌షాపు జట్టు విజయం సాధించాయి. బుధవారం సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
క్రీడల ద్వారా మానసికోల్లాసం : క్రీడల సాధన ద్వారా దేహదారుఢ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని డివిజనల్‌ స్పోర్ట్స్‌ అధికారి జె.ప్రదీప్‌కుమార్‌ పేర్కొన్నారు. సత్యనారాయణపురంలోని రైల్వే ఇనిస్టిట్యూట్‌లో మంగళవారం ప్రారంభమైన డీఆర్‌ఎం కప్‌ బ్యాడ్మింటన్‌ పోటీల ప్రారంభ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజులో కొంత సమయం క్రీడల సాధనకు కేటాయించాలన్నారు. డివిజనల్‌ ఇంజినీర్‌ వరుణ్‌బాబు టోర్నీలో పాల్గొన్న ఉద్యోగులకు టీ-షర్టులు అందించారు. ఎలక్ట్రికల్‌ ట్రాక్షన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రిన్సిపల్‌ ప్రసాదరావు, రైల్వే ఇనిస్టిట్యూట్‌ ఛైర్మన్‌ పి.శ్రీనివాసరావు, కార్యదర్శి ఎస్‌కేకరీంబాషా, వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్పోర్ట్స్‌) ఎన్‌.అర్జునరావు పాల్గొన్నారు. 


Thank You 
Vijayawada TownHub 

URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en 
 Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.  


TAG

nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “హోరా హోరీగా వాలీబాల్‌ పోటీలు