తాజా లోకల్ ఈవెంట్స్
Search

ఈ రోజు అమ్మవారి శ్రీ మహిషాసురమర్దినీ దేవి అలంకారము

**** శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి శ్రీ మహిషాసురమర్దినీదేవి అలంకారము ****


Sri Mahisha Mardhimni

శ్రీ మహిషాసురమర్దినీదేవి :
“ మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జననరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిఘాదిని’’
దేవీ నవావతారాలలో అత్యుగ్రరూపం మహిషాసురమర్దినీ దేవి. ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్దినిగా అవతరించి దుష్ట  శిక్షణ శిష్ట రక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వయుజ శుద్ధనవమినే ‘ మహర్నవమి’ గా భక్తులు ఉత్సవం జరుపుకుంటారు. సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తి రూపంతో ఈ రోజు దర్శనమిస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడ్ని  సంహరించిన అమ్మను మహిషాసురమర్దినీదేవిగా పూజిస్తే శత్రుభయం తొలగిపోయి  సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. చండీ సప్తశతీ హోమం చెయ్యాలి.  “ ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్యైస్వాహా’’ అనే మంత్రాన్ని జపించాలి. చిత్రాన్నం (పులిహోర), గారెలు, వడ పప్పు, పానకం నివేదన చెయ్యాలి. 
Thank You
Vijayawada TownHub

URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en
Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.



nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “ఈ రోజు అమ్మవారి శ్రీ మహిషాసురమర్దినీ దేవి అలంకారము