తాజా లోకల్ ఈవెంట్స్
Search

పున్నమి ఘాట్‌ వరకు తెప్పోత్సవం


**** పున్నమి ఘాట్‌ వరకు తెప్పోత్సవం ****
భక్తులందరూ కనులారా వీక్షించే అవకాశం
గత దసరా నవరాత్రి ఉత్సవాలకు, ఈ ఏడాది వేడుకలకు ఎంతో మార్పు వచ్చింది. అదే విధంగా దసరా పర్వదినం నాడు నిర్వహించే దుర్గమ్మ తెప్పోత్సవం కూడా ఈ ఏడాది ప్రత్యేకతను సంŹరించుకుంది. దుర్గా ఘాట్‌ నుంచి తెప్పోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మూడు సార్లు కృష్ణా నదిలో అమ్మవారిని నదీవిహారం చేయిస్తారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. అయితే తెప్పోత్సవాన్ని తిలకించేందుకు ప్రత్యేకంగా పాసులను ముద్రించి ఇచ్చేవారు. అవి కొద్ది మందికి మాత్రమే చేరేవి. దీంతో తెప్పోత్సవం తిలకించే భాగ్యం కొందరికే దక్కేది. అందువల్ల ఈ ఏడాది భవానీపురం పున్నమి ఘాట్‌ వరకు హంస వాహనాన్ని తీసుకువెళ్లాలని అధికారులు నిర్ణయించారు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని పున్నమి ఘాట్‌ను అందంగా తీర్చిదిద్దారు. వేలాది మంది కూర్చోవడానికి అవకాశం కూడా ఉంది. దీంతో హంస వాహనాన్ని అక్కడి వరకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. మొదటి రౌండు పున్నమి ఘాట్‌ వరకు రానుంది. తర్వాత రెండు రౌండ్లు గతంలో మాదిరిగా ప్రకాశం బ్యారేజీ వద్దే తిప్పనున్నారు. ట్రయల్‌ రన్‌ నిర్వహణ: కృష్ణా నదిలో తెప్పోత్సవం ట్రయల్‌ రన్‌ను ఆదివారం సాయంత్రం నిర్వహించారు. భవానీ ద్వీపం మీదుగా పున్నమి ఘాట్‌ వరకు హంస వాహనాన్ని తీసుకుని వచ్చి తీసుకెళ్లారు. దసరా పర్వదినం నాడు కూడా ఇదే రీతిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం మరొక సారి ట్రయల్‌ రన్‌ను నిర్వహించే అవకాశం ఉంది. ట్రయల్‌ రన్‌ను దుర్గ గుడి ఈవో సూర్యకుమారి, డీసీపీ పాలరాజు, ఏసీపీ రామకృష్ణ, జలవనరుల శాఖ ఈఈ రవిబాబు, తదితరులు పర్యవేక్షించారు.
Thank You
Vijayawada TownHub

URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en
Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.
 


TAG

nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “పున్నమి ఘాట్‌ వరకు తెప్పోత్సవం